మాటలకందని భావాలు

From Wikipedia, the free encyclopedia

మాటలకందని భావాలు

మాటలకందని భావాలు పాట నీతి నిజాయితి (1972) సినిమా కోసం డా. సి. నారాయణరెడ్డి రచించారు. ఈ పాటకు పి.సుశీల నేపథ్యగానం చేసింది. సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా పాటలు విజయవంతమయ్యాయి. అయితే సినిమా పరాజయం పాలైంది.

Thumb
నీతి నిజాయితీ సినిమా పోస్టరు

నేపథ్యం

ఈ సినిమాలో ఏమీ తెలియని అమాయకుడైన కథానాయకుడిని సంఘంలో ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతుంది కథానాయిక. ‘మాటలకందని భావాలు, మంచి మనసులు చెబుతాయి’, కవితలకందని భావాలు కంటి పాపలై చెబుతాయి’ అంటూ కథానాయిక, కథానాయకుణ్ణి ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుంది. వెన్నెల మాటాడదు, మల్లిక మాటాడదు అయినా కానీ వెన్నెలను, మల్లెలను ఆస్వాదించని వారు ఎవరు? అని అడిగి కథానాయకునికి ధైర్యం నూరిపోస్తుంది. ఏనాడు పలకని దైవం ఈ లోకాన్ని ఏలుతుంది కదా? అలాగే నీవు కూడా మాటలు రాకపోయినా గొప్పవాడివి అవుతావని చెబుతుంది. [1]

పాట

పల్లవి :

మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి

కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి | | మాటలకందని | |


చరణం 1 :

వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు

మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు. | | వెన్నెల | |

బాసరాని పాపాయి బోసినవ్వు చాలదా

ఏనాడూ పలకని దైవం ఈ లోకములేలదా | | మాటలకందని | |


చరణం 2 :

పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు

కొండవాగు తరగలలో కోటి రాగమాలికలు | | పిల్లగాలి | |

హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం | | హృదయానికి | |

కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం | | మాటలకందని | |

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.