Remove ads
భారతీయ రచయిత From Wikipedia, the free encyclopedia
మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) ( (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త.
Mahasweta Devi মহাশ্বেতা দেবী | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Dhaka, British India | 1926 జనవరి 14
మరణం | 2016 జూలై 28 కోల్ కత్తా |
వృత్తి | Activist, author |
జాతీయత | Indian |
కాలం | 1956–present |
రచనా రంగం | novel, short story, drama, essay |
విషయం | Denotified tribes of India |
సాహిత్య ఉద్యమం | Gananatya |
గుర్తింపునిచ్చిన రచనలు | Hajar Churashir Maa (No. 1084's Mother) Aranyer Adhikar (The Occupation of the Forest) Titu Mir |
సంతకం |
ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త.
1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.
మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.
90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28 గురువారం న తుది శ్వాస విడిచారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.