మళ్ల విజయ ప్రసాద్
From Wikipedia, the free encyclopedia
మళ్ల విజయ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే. ఆయన రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్) చైర్మన్‌గా పని చేశాడు.
మళ్ల విజయ ప్రసాద్ | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
తరువాత | పి.జి.వి.ఆర్. నాయుడు | ||
---|---|---|---|
నియోజకవర్గం | విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1966 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అరుణ కుమారి | ||
సంతానం | అనూష, అలేఖ్య |
జననం, విద్యాభాస్యం
మళ్ల విజయ ప్రసాద్ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం లో జన్మించాడు. ఆయన ఒడిశాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ నుండి 1998లో బిఏ పూర్తి చేశాడు.[1]
వృత్తి జీవితం
మళ్ల విజయ ప్రసాద్ మొదట ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ప్రారంభించి, అనంతరం రియల్‌ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి వెల్ఫేర్ గ్రూపు స్థాపించి వ్యాపారవేత్తగా, ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి సినిమాలపై ఇష్టంతో సినిమారంగంలోకి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. విజయ ప్రసాద్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్ధులకు ఉచిత విద్యను, పేదవారికి ఉచిత వైద్యశిబిరాలు, పెన్షన్లు లాంటి సేవాకార్యక్రమాలు చేశాడు.[2]
రాజకీయ జీవితం
మళ్ల విజయ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గణ వెంకట రెడ్డి పై 4144 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి [3] 2014, 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ల విజయ్‌ప్రసాద్‌ని రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి చైర్మన్‌గా నియమిస్తూ 17 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.[4] ఆయన ఆగష్టు 25, 2021న చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[5]
సినీ నిర్మాతగా
- సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008)
- సీతారాముల కళ్యాణం లంకలో (2010)
- సీమ టపాకాయ్ (2011)
- ఫ్రెండ్స్ బుక్ (2012)
- రామాచారి (2013)
- ఇంకేంటి నువ్వే చెప్పు (2017) [6]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.