From Wikipedia, the free encyclopedia
ఫ్రెంచ్ ప్రాంతంలో మాయొట్టి (ఫ్రెంచి: మాయొట్టి, షిమాయొరె, మయోరి) అధికారిక నామం మాయొట్టి డిపార్టమెంట్ డి మౌరిటనియే. [1] ఇందులో ఒక ప్రధాన ద్వీపం గ్రాండే-టెర్రె (లేదా మావోరీ), ఒక చిన్న ద్వీపం పెటిటే-టెర్రె (లేదా పమంజి) ఉన్నాయి. ఈ రెండు ద్వీపాల చుట్టూ అనేక ద్వీపాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ద్వీపసమూహం వాయువ్య మడగాస్కరు ఈశాన్య మొజాంబిక్ మధ్య ఆగ్నేయ ఆఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో ఉత్తర మొజాంబిక్ చానలులో ఉంది. ఫ్రాంసు ప్రాంతాలలో " డిపార్టుమెంట్ ఆఫ్ మయొట్టె " పేద ప్రాంతంగా భావించబడుతున్నప్పటికీ మొజాంబిక్ చానెల్లో ఉన్న దేశాలలో ఇది సుసంపన్న దేశంగా భావించబడుతుంది. ఫలితంగా మాయొట్టి అక్రమ వలసలకు ఒక ప్రధాన గమ్యంగా ఉంది.
మాయొట్టి ప్రాంతం 374 చ.కి.మీ ఒక 2017 గణాంకాలు ఆధారంగా జనసంఖ్య 256,518. జనసాంధ్రత చ.కి.మీ. 686 (చ.మై 1,777).[2] గ్రాండే-టెర్రె ద్వీపంలోని మమౌడ్జౌ అతిపెద్ద నగరం, ప్రిఫెక్చరుగా ఉంది. అయినప్పటికీ డ్జయోడ్జి- పమండ్జి అంతర్జాతీయ విమానాశ్రయం పొరుగున ఉన్న పెటిటే-టెర్రె ద్వీపంలో ఉంది. భూభాగం భౌగోళికంగా కొమొరో దీవులలో భాగంగా ఉంది. భూభాగం ముఖ్యంగా కొమొరోస్ యూనియనులో దీనిని దాని ప్రధాన ద్వీపం పేరుతో మయోరి అంటారు.
మాయోట్టే ఒక ప్రత్యేక విభాగంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరాసుదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ప్రజలలో చాలామందికి మొదటి భాషగా ఫ్రెంచి వాడుకభాషగా ఉంది.[3] అయినప్పటికీ పాతనివేదికలో 14 సంవత్సరాలకు మించిన వారు తాము ఫ్రెంచి మాట్లాడగలగలమని (వివిధ స్థాయిలలో) గణాంకాలలో పేర్కొన్నారని వివరించబడింది.[4]ప్రజలలో చాలామందికి షిమావొరె, వైవిధ్యమైన మాండలికాలలో స్వాహిలి (పొరుగు కొమొరో దీవులు వాడుకలో ఉన్న మాండలికాలు) వాడుకలో ఉన్నాయి. అత్యంత విస్తృతంగా మాట్లాడే ద్వితీయస్థాయిలో ఉన్న స్థానికభాష కిబుషి (అత్యంత సన్నిహితంగా స్లోవేకియా మాండలికం మలగాసి భాష)భాష వాడుకలో ఉంది. ప్రజలలో అత్యధికులు ముస్లిం మత అనుయాయులుగా ఉన్నారు.
ద్వీపంలోకి అరబ్బులు ఇస్లాం మతం తీసుకుని వచ్చింది. ఆలస్యంగా రావడంతో తూర్పు ఆఫ్రికా పొరుగు నుండి జనసాంద్రత తక్కువగా ఉంది. 1500 వ శతాబ్దంలో సుల్తానేటు స్థాపించబడింది. 1841 లో ఇబోనియా రాజు ఆండ్రియాంట్సోలి (మడగాస్కర్|మడగాస్కర్) మయొట్టెను జయించాడు (ఫ్రెంచి ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేయడాని ముందు). తరువాత మొహేలి, అంజుయాన్ ద్వీపాలను స్వాధీనం చేసుకున్నాడు. మాయొట్టి ప్రజలు ఉండటానికి ఓటు 1974 కొమొరోస్ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణలో మయొట్టె రాజకీయంగా పరాసుదేశంలో భాగంగా ఉండటానికి అనుకూలంగా, కొమరోసు నుండి స్వాతత్రం పొందడానికి అనుకూలంగా ఓటు వేసారు. 2009 ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా జనవరి 2011 మార్చన ఐరోపా సమాఖ్య ఓవర్సీస్ శాఖగాను, 2014 జనవరి 1 న సుదూర ప్రాంతంగా మారింది.
మాయొట్టి (లేదా మావోరీ) మయోరి (ఫ్రెంచి: గ్రాండే-టెర్రె) గా పిలువబడుతుంది. మయొరె పరిసర ద్వీపాలలో ప్రధానంగా పమంజి (ఫ్రెంచి పెటిటే-టెర్రె) భాగంగా ఉంది. అతిపెద్ద ద్వీపం పేరు మవుటి పదానికి అరబిక్ పదం جزيرة الموت జజిరత్ అల్- మవుట్ మూలపదంగా ఉంది. బహుశా ఈ ద్వీపం చుట్టూ ప్రమాదకరమైన దిబ్బలు ఉన్నందున దీనికి మవూట్ ("మరణం ద్వీపం" అని అర్థం). మవూట్ పదానికి పోర్చుగీసు రూపాతంరమే మయొట్టె. తరువాత ఈ పేరు ఫ్రెంచిలోకి మారింది. అయితే స్థానిక పేరు మహో అరబిక్ ఎటిమాలజీ సందేహాస్పదంగా ఉంది.
ప్రధాన ద్వీపం గ్రాండే-టెర్రె (లేదా మావోరీ) భౌగోళికంగా కొమొరో దీవులలో భాగంగా ఉండేది. ఈ ద్వీపాల పొడవు 39 కిలోమీటర్ల (24 మైళ్ళు), వెడల్పు 22 కిలోమీటర్లు (14 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. 660 మీటర్లు (2,165 సముద్ర మట్టానికి అడుగులు)ఎత్తైన బెనరా పర్వతం ఈ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. కొన్ని ప్రాంతాలలో అగ్నిపర్వత శిఖరం మట్టి సమృద్ధిగా ఉండేది. ఒక పగడపు దిబ్బ ఓడల నుండి ద్వీపాలను రక్షిస్తుంది. రాజధానిగా (ముందు కాలనీల కొమొరోస్ రాజధాని)డ్జౌడ్జి ఉండేది. 1977 లో తరువాత రాజధాని ప్రధానదీవి గ్రాండే-టెర్రెలోని మమౌడ్జౌకు తరలించబడింది. పెటిటే-టెర్రె (లేదా పమంజి) వైశాల్యం 10 చ.కి.మీ ( 4 మై) మయోరి ఆనుకొని ఉన్న పలు లఘుద్వీపాలు ఉన్నాయి. రీఫ్ వెనుక మడుగు ప్రాంతం గరిష్టంగా 8 మీ లోతుకు చేరుకుంది. దీని వైశాల్యం సుమారు 1,500 (580 చ.మై). ఇది నైరుతి హిందూ మహాసముద్రం సంక్లిష్టమైన "అతిపెద్ద అవరోధంగా వర్ణించబడుతుంది.[5]
మాయొట్టి ఒక ప్రధానంగా అగ్నిపర్వతాల ద్వీపం మాంట్ Benart న 660 మీటర్ల (2,170 అడుగులు) ఎత్తులో సముద్రపు అడుగు నుండి ఏటవాలుగా పెరుగుతున్న ఉంది (ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఈ 661 మీటర్ల (2,169 అడుగులు ఇస్తుంది)).
రెండు అగ్నిపర్వత కేంద్రాలు ఉన్నాయి. (చాంగు శిఖరం ఎత్తు 594 మీటర్ల (1,949 అడుగులు), వాయవ్యంలో ఒక బిలం, ఉత్తర మద్యప్రాంతంలో ఒక బిలంతో ( ఎం.ట్సపరె 572 మీటర్ల (1,877 అడుగులు)) ఉంది. ఈ రెండు శిఖరాల మలుపులో ఉన్న బెనరత్ పర్వతం రెండు శిఖరాలను అనుసంధానిస్తుంది. అగ్నిపర్వత సంబంధమైన కార్యకలాపాలు 2.7 మిలియన్ సంవత్సరాల క్రితం నిలిచిపోయింది. దక్షిణప్రాంతంలో 7.7 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కార్యాచరణ 4.7 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమై 1.4 మిలియన్ సంవత్సరాల క్రితం నిలిచిపోయింది.[6] ఇటీవల బి.పి. 7000 క్రితం ఒక బూడిద బ్యాండు వెలువడినట్లు నివేదించబడింది.[5]
2018 నవంబరు 11 న మయొట్టె తీరంలో భూకంపం (15 మైళ్ళ (24కి.మీ)విస్తారంలో) సంభవించింది. ఇది దాదాపు 11,000 మైళ్ల (18,000 కి.మీ) దూరంలో ఉన్న కెన్యా, మెక్సికో, న్యూజిలాండు, కెనడా, హవాయి సహా అనేక ప్రదేశాలలో ప్రకంపనలు రికార్డు చేయబడ్డాయి.[7] భూకంప తరంగాలు 20 నిమిషాలు సమయం కొనసాగింది. కానీ ఈ ఉన్నప్పటికీ ఎవరికీ ఇది సంభవించిన అనుభవం కలగలేదు.[8][7]
మయొట్టె 50 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 3000 మీ లోతున కొత్తగా కనుగొనబడిన అగ్నిపర్వతం కారణంగా ఈ భూకంపం సంభవించిందని కనుగొనబడింది.[9]
మాయొట్టి ఒక విలక్షణ ఉష్ణ పగడపు దిబ్బలతో పరివేష్టితమై ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద, లోతైన సరస్సులతో ఉన్న పలు పగడపు దిబ్బలను కలిగి ఉంది. వీటిని మడ అరణ్యాలు విడదీస్తూ ఉంటాయి. అన్ని మాయొట్టి జలాల ఒక నేషనల్ మెరైన్ పార్కు నిర్వహణలో ఉన్న ఇవి నేచురల్ రిజర్వులుగా ఉన్నాయి.
వెలుపలి పగడపు దిబ్బ 195 కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో 1,500 చ.కి.మీ వైశాల్యం కలిగిన మడుగు ఉంది. ఇందులో 7.3 చ.కి.మీ. వైశాల్యంలో మడ అరణ్యం ఉంది. అక్కడ కనీసం 250 జాతుల పగడపు దిబ్బలు ఉన్నాయి. ఉష్ణమండల చేపలు 760 జాతులు ఉన్నాయి.[10]
మాయొట్టిలో ఒక గొప్ప వైవిధ్యం ఉన్న మొక్కజాతులు ఉన్నాయి: ద్వీపంలో 1,300 జాతుల కంటే అధికమైన నమోదు మొక్కజాతులు ఉన్నాయి. ద్వీపవైశాల్యంతో పోల్చి చూస్తే ప్రపంచంలో సుసంపానమైన వృక్షజాతి కలిగిన ద్వీపాలలో ఈ ద్వీపం ఒకటిగా నిలిచింది. [11] ద్వీపం 15% భాగం సహజ రిజర్వుగా వర్గీకరించబడింది; మూల అటవీ భాగం ప్రస్తుతం అక్రమ అటవీ నిర్మూలన కారణంగా కేవలం 5% మాత్రమే మిగిలి ఉంది.
అనేక అగ్నిపర్వత ద్వీపాలు ఎగిరే నక్కల వంటి క్షీరదాలకు మాత్రమే ఆశ్రయం ఇస్తున్నాయి. సరీసృపాలు 18 జాతులు, 116 సీతాకోకచిలుకలు, తూనీగ జాతులు 38, గొల్లభామజాతులు 50 జాతులు, బీటిల్సు 150 జాతులు ఉన్నాయి.[11]
1500 లో మయోరి ద్వీపంలో సుల్తానేటు స్థాపించబడింది. 1503 లో మాయోట్టేను పోర్చుగీసు అన్వేషకులు చేరుకుని దీనికి మొదటగా ఎస్పిరిటూ శాంటో పేరు పెట్టారు. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని కాలనీగా చేయలేదు. ద్వీపం స్వాహిలి తీరం సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. (అకౌ సమీపంలో 11 వ శతాబ్ధంలో, 9 వ - 12 వ శతాబ్దాల మధ్య డెంబెనీ సమీపంలో ముఖ్యంగా 11 వ శతాబ్ద కాలంలో ద్వీపం సుసంపన్నంగా ఉంది. అయితే దాని సోదర ద్వీపం అంజౌన్ సముద్రతీరంలో పెద్ద బోటు నిలుపగలిగిన కారణంగా అంతర్జాతీయ వర్తకులు మయొట్టె ద్వీపాలకు ముఖ్యత్వం ఇచ్చారు. ఇతర మూడు కొమొరోస్ దీవులు పోలిస్తే మయొట్టె అభివృద్ధి దీర్ఘకాలం పేలవంగా ఉండిపోయింది. ఫలితంగా మయొట్టె తరచుగా సముద్రపు దొంగలకు, మాలాగసి లేదా కొమొరియన్ దాడులు లక్ష్యంగా ఉంది.
1832 లో మయొట్టెను ఆండ్రియాంట్సోలి ఆక్రమించుకున్నాడు. మాజీ రాజు ఐబోనియా మడగాస్కరు పారిపోయాడు. 1833 లో ఇది పొరుగున మ్వాలి సుల్తానేటు (ఫ్రెంచిలో మొహేలి ద్వీపం) స్వాధీనం చేసుకున్నారు. 1835 నవంబరు 19 న మయొట్టెను తిరిగి డ్జువాని సుల్తానేటు (ఫ్రెంచిలో అంజుయాను సుల్తానేట్) ఆక్రమించింది. తరువాత ఈప్రాంతానికి రాజప్రతినిధి (అరబిక్ قاض అంటే నిర్ధారించడం వ్రాయబడినది) నియమించబడ్డాడు. తరువాత ఈ ద్వీపాలలో ఇస్లామిక్ శైలి స్థాపించబడింది. అయితే స్థానిక సుల్తాను ఆధ్వర్యంలో 1836 లో స్వతంత్రాన్ని పొందింది. 1836 లో ఈ ద్వీపాన్ని తిరిగి ఆండ్రియాంట్సోలి గెలుచుకున్నాడు. కానీ జనసాంధ్రత తక్కువగా ఉండడం, రక్షణ లేని ద్వీపం కొమొరోస్, మాలాగసి సుల్తానుల దాడులు, దొంగల దాడుల కారణంగా బలహీనపడింది. అందువలన సుల్తానుల శక్తివంతమైన మిత్రుల సహాయం కొరకు ఫ్రెంచి వారితో చర్చించడం ప్రారంభించాడు. 1840 లో నోసి సమీపంలోని నోసి ద్వీపంలోని మలగాసి వారికి స్థావరంగా ఇచ్చాడు.
1841 లో మయొట్టెను పరాసుదేశం కొనుగోలు చేసి ఫ్రెంచికిరీటానికి స్వాధీనం చేయమడింది. తరువాత శతాబ్దాలుగా ద్వీపంలో ఆధిపత్యం చెలాయించి బానిసత్వం పాలన సాగించింది. బానిసలను యజమానులకు ఉచితంగా పంపి, ద్వీపం ధ్వంశం చేసి వదిలివెళ్ళారు.
అందువలన మయొట్టె ఒక ఫ్రెంచి ద్వీపం అయింది. కానీ ఈ ద్వీపం అనేక దాడుల కారణంగా కొన్ని దశాబ్ధాల కాలం మానవ రహితంగా ఖాళీగా ఉంది. మాజీ ప్రముఖులు, వారి బానిసలతో ద్విపాన్ని విడిచి వెళ్ళారు. ఫ్రెంచ్ పరిపాలన అంజౌన్ ప్రముఖ కుటుంబాలను ఆహ్వానించడం ద్వారా తిరిగి మానవనివాసితం చేయడానికి ప్రయత్నించింది. మయొట్టెను విడిచి మడగాస్కరు, కొమరోసుlలలో ఆశ్రితులుగ ఉన్న ప్రముఖులు, బానిసలను ద్వీపానికి ఆహ్వానించి తోటల యజమానులను పిలిచి నష్టపరిహారం తీసుకుని వారి భూములను మయొట్టె ప్రజలకు అప్పచెప్పమని ఫ్రెంచిప్రభుత్వం ప్రతిపాదించింది. అంజౌను ప్రముఖులకు వాణిజ్యం ఏర్పాటు చేసారు.
వెస్టు ఇండీస్, రీయూనియన్ జాగృతమయ్యే సమయంలో మాయొట్టెను ఒక చక్కెర ద్వీపంగా చేయాలని ఫ్రెంచిప్రభుత్వం ప్రణాళిక వేసింది. లోతైన ఏటవాలుప్రాంతాలు ఉన్నప్పటికీ తోటలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబడ్డాయి. 1851 నుండి అభివృద్ధిలో భాగంగా 17 చక్కెర ఫ్యాక్టరీలు నిర్మించి వందలాది విదేశీ కార్మికులు (ప్రధానంగా ఆఫ్రికన్ (ప్రత్యేకంగా మొజాంబిక్) చెందిన వారు) నియమించబడ్డారు. అయితే ఉత్పత్తి మాత్రం ఆశించినంత సాధించలేక పోయారు. 1883-1885 చక్కెర సంక్షోభం మయొట్టెలో చెరకు పంట ముగింపుకు దారితీసింది. ఫలితంగా కొన్ని ఫ్యాక్టరీ అవశేషాలు మాత్రమే మయొట్టెలో మిగిలాయి. వీటిలో కొన్నింటిని ఇప్పటికీ చూడవచ్చు. 1955 లో జౌమొగ్నె ద్వీపంలో ఉన్న ఫ్యాక్టరీ చివరిగా మూసివేయబడింది. ద్వీపానికి దక్షిణంలో ఉన్న సౌలౌ చక్కెర ప్లాంటు చక్కగా సంరక్షించబడింది.
1885 లో బెర్లిన్ సదస్సులో పరాసుదేశం మొత్తం కొమొరోస్ ద్వీపసమూహం మీద నియంత్రణ సాధించింది. వాస్తవానికి ఈ ప్రాంతం అప్పటికే ఫ్రెంచిపాలనలో ఉంది. కాలనీ పేరు మాత్రం "మాయొట్టి అండు డిపెండెంసీలు" అనే ఉంది.
1898 లో రెండు తుఫానులు ద్వీపాన్ని నేలమట్టం చేసాయి. ప్రాణాలతో బయటపడినవారి ప్రాణాలను మశూచి మహమ్మారి మట్టుపెట్టింది. మాయొట్టి మరోసారి మొదలు నుండి జీవనం ప్రారంభించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం మొజాంబిక్, కొమొరోస్, మడగాస్కర్ నుండి తీసుకుని వచ్చిన కార్మికులతో ద్వీపంలో తిరిగి మానవనివాసితంగా మారింది. చక్కెర పరిశ్రమ వదిలివేయబడి ఆస్థానం వనిల్లా, కాఫీ, కొబ్బరి, నువ్వుల భర్తీ చేయబడింది. తరువాత ద్వీపంలో వెటివేర్, క్రిమిసంహారిక తైలము, ముఖ్యంగా చందనం (లాంగ్-లాంగ్) వంటి సువాసన మొక్కల పంటలు అభివృద్ధి చేయబడ్డాయి. తరువాతి కాలంలో ద్వీపం చిహ్నాలలో సుగంధద్రవ్యాలు ఒకటి అయ్యాయి.
1974 - 1976 లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కొమరోసు ద్వీపాలలో మాయొట్టి ద్వీపం మాత్రమే కొమరోసు నుండి స్వాతంత్రం పొందడానికి ఫ్రెంచితో సంభంధాలు కొనసాగించడానికి వరుసగా 63.8% ఓట్ల 99.4% ఓట్లను నమోదు చేసింది. యునైటెడ్ నేషన్సు వలసరాజ్యాల ఉపసంహరణ 'విధానంలో స్థిరంగా ఉంటూ వలసరాజ్యాల సరిహద్దుల స్వాతత్ర్యానికి మద్దతుగా నిలిచి ఈ ప్రజాభిప్రాయసేకరణను గౌరవించలేదు. స్వతంత్ర కొమొరోస్ మయొట్టె ద్వీపం మీద అధికారం కోరలేదు. ఐఖ్యరాజ్యసమితి మాయొట్టెను పరాసుదేశం విలీనం చేసుకోవడాన్ని ఖండించింది.[12] 1976 లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంలో మాయొట్టి మీద కొమొరియన్ సార్వభౌమత్వాన్ని గుర్తించి కౌన్సిల్ సభ్యులు 15 లో 11 మద్దతు ప్రకటించారు.[13] కౌన్సిలులో ఫ్రాసు ఒంటరిగా వీటో ప్రకటించింది.[14]1995 వరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ టైటిల్ "మాయొట్టి కొమొరియన్ ద్వీపం ప్రశ్న" మాయొట్టె విషయం వరుస నిర్ణయాలు ప్రకటించింది. 1955 వరకు జనరల్ అసెంబ్లీ మయొట్టె సమస్య చర్చించ లేదు. తరువాతి ప్రజాభిప్రాయ సేకరణలు అన్నింటిలో మయొట్టె ప్రజలు ఫ్రెంచితో ఉండటానికి బలమైన ఆసక్తిని చూపాయి.
2009 మార్చి 29 నివేదిక పర్యవసానంగా 2011 మార్చిలో మయొట్టె పరాసుదేశం ఒక విదేశీ శాఖ మారింది.[15] ఫలితంగా పరాసుదేశం 101 వ శాఖగా మారింది. ఒక ఫ్రెంచ్ "ఇవిదేశీ సమాజం"లో ద్వీపంలో స్వయం ప్రతిపత్తికి అనుకూలంగా ఒక 95.5% ఓటు నమోదైంది.[16] సంప్రదాయ అనధికారిక ఇస్లామిక్ చట్టం దినసరి జీవితంలో కొన్ని అంశాలను క్రమంగా రద్దుచేసి ఆ స్థానాన్ని " యూనిఫాం ఫ్రెంచ్ సివిల్ కోడ్ " తో భర్తీ చేయబడుతుంది.[17] అదనంగా మయొట్టెలో ఫ్రెంచ్ సాంఘిక సంక్షేమం, పన్నులు వర్తించబడుతున్నాయి.[18] కొమొరోస్ అక్కడ ఫ్రెంచ్ సైనిక స్థావరం ఉన్నందుకు విమర్శిస్తూ ద్వీపం మీద హక్కులను కొరకు వాదిస్తుంది.[19]
మయొట్టె రాజకీయాలు పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వం ఫ్రేంవర్కు, ఒక బహుళ-పార్టీ విధానం అనుసరిస్తుంది. అనగా డిపార్ట్మెంటలు కౌన్సిలు అధ్యక్షుడు స్థానిక అసెంబ్లీ అధినేతగా వ్యవహరిస్తాడు. కార్యనిర్వాహణ అధికారాన్ని ఫ్రెంచి ప్రభుత్వం కలిగి ఉంటుంది.
ఫ్రెంచి జాతీయ అసెంబ్లీలో ఒక మయొట్టె డిప్యూటీ ఉంటాడు. ఫ్రెంచి సెనేటు ఇద్దరు సెనెటర్లు పంపుతుంది.
పరాసుదేశం ఇతర దూరతీర ప్రాంతాలు, విభాగాల కంటే ప్రత్యేకంగా మయొట్టెలో " డిపార్టుమెంటలు కౌన్సిల్ " స్థానిక, డిపార్టుమెంటల్ కౌన్సిల్ రెండింటి బాధ్యతలు వహిస్తుంది.
మయొట్టె పరిస్థితి పరాసుదేశంకు ఇబ్బందికరంగా ఉంటుంది; ఒకవైపు స్థానిక ప్రజలు పరాసుదేశం నుండి స్వతంత్రం పొంది కొమొరోసులో విలీనం కావాలని కోరుకోలేదు. కాలనీ తరువాత లెఫ్టిస్టు ప్రభుత్వాలు సంబంధాలను విమర్శించాయి.[ఆధారం చూపాలి] ఎక్కువగా సదాచార ముస్లిం మతం చట్టం ద్వారా పాలించబడుతున్న మాయొట్టిలో పరాసుదేశం న్యాయవ్యవస్థలో సమైఖ్యపరచడం క్లిష్టంగా ఉంటుంది. మయొట్టె ప్రజల జీవనస్థాయి, జీవన ప్రమాణాలు పరాసుదేశం ప్రధాన భూభాగంలోని ప్రజలకు జీవనప్రమాణ స్థాయికి సమానంగా తీసుకుని రావడంలో విఫలం అయ్యారు. ఈ కారణాల వలన జాతీయ పార్లమెంటు ఆమోదించిన చట్టాలను మయొట్టెలో అనువర్తింప చేయాలని వారు భావించారు.
2001 లో మయొట్టి హోదా " డిపార్ట్మెంటు ఆఫ్ పరాసుదేశం " హోదాకు దాదాపు సమానంగా మార్చబడింది. ప్రజాభిప్రాయసేకరణలో ఓటర్లు ఈ మార్పుకు అనుకూలంగా 73% ఓట్లు వేసారు. 2003 రాజ్యాంగ సంస్కరణల తర్వాత మయొట్టె తన "డిపార్టుమెంటల్ కలెక్టివిటీ " హోదా నిలుపుకుంటూ " ఓవర్సీస్ కలెక్టివిటీ " అయింది.
2009 మార్చిలో ప్రజాభిప్రాయ సేకరణ (" మహోరన్ స్టేటస్ రిఫరెండం ") నిర్వహించబడింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు అత్యుత్సాహంగా పాల్గొని 95% ఓట్లతో ప్రజాభిప్రాయసేకరణకు అనుకూలంగా ఓట్లు వేసారు. తరువాత 2011 మార్చి 31 న ఫ్రాన్స్ విదేశీ శాఖ (డిపార్టమెంట్ డి'అవుటర్-మెర్) మారింది.[21][22] విదేశీ శాఖగగా మారడం అంటే మిగతా పరాసుదేశం ఉపయోగించిన అదే చట్టపరమైన, సామాజిక వ్యవస్థను దత్తతగా స్వీకరించడం అవుతుంది. ఈ విధానంలో కొన్ని చట్టాలు మినహాయింపుగా ప్రామాణిక ఫ్రెంచి పౌర కోడ్ ఆచరించే న్యాయవ్యవస్థకు అంగీకారం ఉంటుంది. విద్యా సాంఘిక, ఆర్థిక వ్యవస్థల సంస్కరణలు 20 సంవత్సరాల కాలం పైగా జరుగడానికి ఈ విధానం ద్వారా అవకాశం లభిస్తుంది.[23]
మయొట్టె " ఓవర్సీస్ కలెక్టివిటీ " హోదా నుండి " డొమెస్టిక్ కాంస్టిట్యూషనల్ " పరిణామం చెందిన తరువాత పూర్తిస్థాయి ఫ్రెంచి నియోజకవర్గంగా మారింది. ఐరోపాసమాఖ్య మయొట్టెను " ఓవర్సీస్ కంట్రీగానూ భూభాగంగానూ " గౌరవించింది. [24]
మయొట్టె 17 కమ్యూనులుగా విభజించబడింది. అదనంగా 13 కంటోనులు ఉన్నాయి.
మయొట్టె అధికారిక కరెన్సీ యూరో.[25]2017 లో మాయొట్టి జి.డి.పి. € 2.9 బిలియన్లు (US $ 3.3 బిలియన్లు).[26] అదే సంవత్సరంలో మార్కెట్ మార్పిడి రేట్లు వద్ద మాయొట్టి తలసరి జి.డి.పి € 11,354 (US $ 12,820),[26] ఆ సంవత్సరంలో కొమొరోస్ తలసరి జి.డి.పి కంటే ఇది 16 రెట్లు ఎక్కువగా ఉంది. కానీ కేవలం 49.5% రీయూనియన్ తలసరి, మెట్రోపాలిటన్ పరాసుదేశం తలసరి జి.డి.పి.లో 33% శాతం ఉంది. జీవన ప్రమాణాలు పరాసుదేశం మెట్రోపాలిటన్లో కన్నా తక్కువగా ఉంటాయి. మూడవ వంతు జనాభా జీవితాలను ప్రజా నీటి సరఫరా సౌకర్యాలకు దూరంగా జీవిస్తున్నారు.[27]అదనంగా గృహలలో 10% నికి విద్యుత్తు సౌకర్యం లేదు.[28]
స్థానిక వ్యవసాయ అభద్రత, మరింత ఖరీదైన శ్రామికశక్తి, మడగాస్కర్, కొమొరోస్ సమాఖ్య ఎగుమతి మైదానంలో పోటీకి నిలవలేక పోవడం వంటి బెదిరింపులకు గురౌతుంది. ద్వీపం ప్రధాన ఆర్ధిక వనరుగా ఉన్న పర్యాటకం అధికరుసుము వసూలు చేయబడడం కారణంగా దెబ్బతింటూ ఉంది.
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1958 | 23,364 | — |
1966 | 32,607 | +39.6% |
1978 | 47,246 | +44.9% |
1985 | 67,205 | +42.2% |
1991 | 94,410 | +40.5% |
1997 | 1,31,320 | +39.1% |
2002 | 1,60,265 | +22.0% |
2007 | 1,86,452 | +16.3% |
2012 | 2,12,645 | +14.0% |
2017 | 2,56,518 | +20.6% |
2020 | 2,79,471 | +8.9% |
2020 జనవరి 1 న మయొట్టె జనసంఖ్య 2,79,471.[29] 2017 జనాభా లెక్కలు ఆధారంగా మయొట్టెలో నివసిస్తున్న ప్రజలలో 58.5% మంది మయొట్టెలో (2007 జనగణనలో డౌన్ 63.5%) జన్మించారు. 5.6% (విదేశీ పరాసుదేశం గాని పరాసుదేశం మెట్రోపాలిటన్) ఫ్రెంచి రిపబ్లికులో జన్మించారు. 35.8% (2007 లో 4.8%) వలసదారులు విదేశీదేశాలలో (2007 లో 31.7% నుండి, 28.3% లో కొమొరోస్ సమాఖ్య) జన్మించారు. 2.6% మడగాస్కర్ ఇతర దేశాలలో మిగిలిన 0.8%).[30][31]
ద్వీపం నివాసితులలో అత్యధికులు కొమరియన్ సాంస్కృతికంగా చెందినవారు ఉన్నారు. కొమరియన్ నివాసులలో ఇరానియన్ వ్యాపారులు, ప్రధాన భూభాగం ఆఫ్రికన్ అరబ్బులు, మాలాగసి ప్రజలు ఉన్నారు. కొమొరియన్ వర్గాలు కొమొరోస్, మడగాస్కర్ వంటి ఇతర ప్రాంతాలలో ఉన్నారు.
కొమొరోస్ సమాఖ్య నుండి వలసదారులు వెల్లువ కారణంగా స్థానిక మహోరానులు అల్పసంఖ్యాక వర్గాలుగా మారారు. 2017 జనగణనలో మాయొట్టి జన్మించిన ప్రజలు పెద్దల జనాభా మాత్రమే 39.9% విదేశాల్లోనూ (ప్రధానంగా కొమొరోస్ యూనియన్) లో జన్మించారు. ప్రజల వయోజన జనాభా 54.6% ఉన్నారు.[32] 2017 లో విదేశాల (ప్రధానంగా కొమొరోస్ సమాఖ్యలో) లో జమ్నించిన తల్లులు 75,7% జననాలు సంభవించాయి. పడింది.[33]
మయొట్టెలో ఇస్లాం ప్రధాన మతంగా ఉంది.[34]జనాభాలో 97% మంది ముస్లిం మతస్తులు, 3% మంది క్రైస్తవులు ఉన్నారు.[35]
రోమన్ కాథలిక్కులు ప్రధాన అల్పసంఖ్యాక మతస్తులుగా ఉన్నారు. వీరికి డియోసెసు లేనప్పటికీ కామోరోసు కలిసి ఆరాధనలో పాల్గొంటారు. కామోరోసు ద్వీపసమూహంలో " అపోస్టోలికు వికరియేటు ఆఫ్ కొమరోసు ఆర్చిపిలాగో " అధికార మిషనరీ జ్యూరిడిక్షన్ ఉంది.
మయొట్టె ఏకైక అధికారిక భాష ఫ్రెంచి. ఇది పరిపాలన, పాఠశాల వ్యవస్థకు ఉపయోగించబడుతుంది. ఇది టెలివిజన్, రేడియో అలాగే వాణిజ్య ప్రకటనలలో, బిల్ బోర్డులలో అత్యధికంగా వాడుకలో ఉంది. మయొట్టెలో ఫ్రెంచి జ్ఞానం పరాసుదేశం, ఇతర భూభాగాల కంటే తక్కువగా ఉంటుంది. మయొట్టె స్థానిక భాషలు:
కిబుషి దక్షిణ, మాయొట్టి వాయువ్యంలో వాడుకలో ఉంది. మిగిలిన భాగంలో షిమొరె వాడుకలో ఉంది.
ఫ్రెంచి పాటు, ఇతర స్థానిక భాషలు కూడా మాయొట్టిలో ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి:
2012 - 2017 జనాభా గణాంకాలలో భాషల వినియోగం సంబంధించిన ప్రశ్నలు అడిగలేదు. మయొట్టె భవిష్యత్తు జనాభా గణాంకాలలో కూడా భాషా సంబంధిత ప్రశ్నలు ఉండవని భావించబడుతుంది. చాలా పాతది జనాభా గణాంకాల తరువాత చివరి అధికారిక గణాంకాలలో (2007) భాషలు అంశం మీద ప్రశ్నలు ఉన్నాయి. 2007 లో ఫ్రెంచి అక్షరాస్యత, శిక్షణ పరిఙానంలో తగినంత మెరుగుదల కనిపించింది.
2007 జనగణనలో 14 సంవత్సరాల కంటే అధిక వయస్కులలో 63.2% మంది తాము ఫ్రెంచిలో సంభాషించగలమని పేర్కొన్నారు. 14-19 మద్య వయస్కులలో 87.1% ప్రజలు తాము ఫ్రెంచి మాట్లాడే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. 65 మయసు పైబడిన వారిలో 19.6% మది మాత్రమే తాము ఫ్రెంచిలో సంభాషించగలమని పేర్కొన్నారు. 14 వయసు కంటే అధిక వయస్కులలో 93,8% మయొట్టె ప్రజలు మయొట్టె స్థానిక భాషలలో (షిమొరె, కిబుషి, కియాంటలయొట్సి భాషలను 'స్థానిక భాషల చేర్చారు. ఇవి కొమొరియన్ మాండలికాలు) ఒకదానిని తాము మాట్లాడగలమని పేర్కొన్నారు. 14 అంత కంటే ఎక్కువ వయస్సున్న జనాభాలో 6.2% మంది ప్రజలకు స్థానిక భాషా ఙానం లేదని వివతించారు.[4]
2006 లో ఫ్రెంచి విద్యాశాఖా మంత్రిత్వశాఖ నిర్వహించిన ఒక సర్వేలో విద్యార్థులు తాము మాట్లాడే భాషలు, తమ తల్లితండ్రులు మాట్లాడే భాషలగురించి మాట్లాడిన సమయంలో వారు ఈ క్రింది విధంగా వెల్లడించారు;[36]
గణాంకాలలో ద్వీతీయ భాషగా వివరించిన భాషలు;
కేంద్ర ఫ్రెంచి ప్రభుత్వం నిర్భంధ విద్య, ఆర్థికాభివృద్ధి అమలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మాయొట్టిలో ఫ్రెంచి భాష గణనీయంగా అభ్యున్నతి చెందింది. నేషనల్ విద్యా మంత్రిత్వశాఖ నిర్వహించిన సర్వే ప్రధమ, ద్వితీయ భాషగా ఫ్రెంచి మాట్లాడేవారు జనాభాలో 56.9% ఉన్నారని వివరించింది. వీరి సంఖ్య ద్యార్థుల తల్లిదండ్రులు కోసం మాత్రమే 37.7% అని సూచించబడింది. విధ్యార్ధులలో 97.0% మంది (10 - 14 మద్య వయస్కులు) ఫ్రెంచి మాట్లాడగలరు.
ఈ రోజులలో మయొట్టి కుటుంబాలలో ఫ్రెంచి పిల్లల సాంఘికాభివృద్ధికి సహకరిస్తుంది అనే ఆశతో తమ పిల్లలను ఫ్రెంచిలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్రెంచి స్కూలింగు, ఫ్రెంచ్-భాష టెలివిజన్ ప్రభావంతో అనేకమంది యువకులలో స్థానికంగా భాషలు, ఫ్రెంచ్-ఆధారిత క్రియోల్ వాడుకలోకి వచ్చింది. కిబుషి, ఫ్రెంచి వంటి భాషలు మాట్లాడే సమయంలో కూడా యువత ఫ్రెంచి పదాలను అధికంగా వాడుతూ ఉన్నారు. ఇది స్థానిక భాషలు అదృశ్యంకావడానికి దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.[37]
జనాభాలో సుమారు 26% మంది స్త్రీ, పురుషులు వారిలో ఆత్మప్రవేశించినట్లు విశ్వసిస్తారు.[38]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.