Remove ads
From Wikipedia, the free encyclopedia
మనీషా అశోక్ చౌదరి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మహారాష్ట్ర శాసనసభకు దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
మనీషా అశోక్ చౌదరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | వినోద్ ఘోసల్కర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దహిసర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 18 జూన్ మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అశోక్ చౌదరి | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మనీషా అశోక్ చౌదరి భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి వినోద్ ఘోసల్కర్‌పై 38,578 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అరుణ్ సావంత్‌పై 63,917 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5]
మనీషా అశోక్ చౌదరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి వినోద్ ఘోసల్కర్‌పై 44,329 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.