From Wikipedia, the free encyclopedia
మధ్యాహ్నం అంటే ఉదయమునకు, సాయంత్రమునకు మధ్య నుండే సమయం.[1] మధ్యాహ్నం సాధారణంగా మధ్యాహ్నం 12:00 గంటలకు మొదలవుతుంది, అయితే ఇది ఎప్పుడు ముగుస్తుందనే దానిపై కచ్చితమైన నిర్వచనం లేదు. అయితే మధ్యాహ్నమునకు ఒక కచ్చితమైన సమయమును చెప్పాలనుకుంటే మధ్యాహ్నం అనేది మధ్యాహ్నం 12:00 గంటలకు మొదలయి మధ్యాహం 3.44 వరకు ఉంటుందని చెప్పవచ్చు. మధ్యాహ్నమును ఆంగ్లంలో Afternoon అంటారు. సరిగ్గా మధ్యాహ్నం 12:00 గంటల సమయాన్ని మిట్ట మధ్యాహ్నం అని అంటారు. మిట్ట మధ్యాహ్నమును ఆంగ్లంలో Noon అంటారు. మిట్ట మధ్యాహ్నం సమయములో సూర్యుడు మనకు నడి నెత్తిన అత్యంత శిఖరమున ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం నుంచి సూర్యుడు మన నడి నెత్తిపైన అత్యంత శిఖరం నుంచి పడమర వైపుకి వాలుతూ కిందికి దిగుతూ నడిరాత్రికి అత్యంత కిందికి వస్తాడు. రోజులో మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా వుండి అత్యంత వేడిగా వుంటుంది, అత్యంత వెలుతురుతో వుంటుంది. మధ్యాహ్నం సమయమంతా సూర్యుడు మనకు నెత్తిపైన ఉంటాడు.[2][3] రోజును పగలు, రాత్రి అని రెండు భాగములుగా విభజించారు. పగలును ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని మూడు భాగాలుగా చెప్పవచ్చు. మధ్యాహ్నం అనేది పగటి సమయంలో కొంత భాగం.
Seamless Wikipedia browsing. On steroids.