Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
మధుబని బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ పరిధిలోకి వస్తుంది. పట్టణ పరిపాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది. ఇది దర్భంగా పట్టణానికి ఈశాన్యంగా 26 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం ఇది ' బేతియా సంస్థానం'లో భాగంగా ఉండేది. ఆ సంస్థాన పాలక వారసుల్లో వచ్చిన విభేదాల కారణంగా సంస్థానంలో కొంత భాగం వేరుపడి మధుబని సంస్థానం ఏర్పడింది.[1] "మధుబని" అనే పదానికి " తేనె అడవి " అని అర్ధం. దీని నుండి మధుబని ఉద్భవించింది, అయితే కొన్నిసార్లు దీనికి "మధు" + "వాణి" అనే అర్థం కూడా చెబుతారు. దీని అర్థం "తీపి" "శబ్దం/భాష".[2]
మధుబని 26.37°N 86.08°E నిర్దేశాంకాల వద్ద,[3] సముద్ర మట్టానికి 56 మీటర్ల ఎత్తున ఉంది. (183) అడుగులు ).
2011 జనగణన నాటికి [4] మధుబని జనాభా 1,66,285. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 71.06%. ఇది జాతీయ సగటు 62.39% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 78.81%, మహిళా అక్షరాస్యత 53%. మధుబని జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.