చేప
నీటిలో నివసించే సకశేరుక జంతువు (సాధారణంగా) మొప్పలు కలిగి ఉంటుంది From Wikipedia, the free encyclopedia
నీటిలో నివసించే సకశేరుక జంతువు (సాధారణంగా) మొప్పలు కలిగి ఉంటుంది From Wikipedia, the free encyclopedia
చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు. (డా.చిప్పగిరి).మానవ ఆహారముగా వినియోగించు చేపలు, రొయ్యలు, నాచులు, ముత్యాలు, ఆలిచిప్పల పెంపకమును" జలవ్యవసాయము -Aquaculture" అంటారు (Aquaculture in India-C.Gnaneswar and C.Sudhakar-1997).చేపల మాంసము తెల్లనికండరాలతో, విటమిన్-A, D, E, Kలతో, రుచికరమైన, బలవర్ధకమైన, క్రొవ్వుపదార్థములు తక్కువగా కలిగిన, సులభముగా జీర్ణ మయే మానవ ఆహారము.నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సుల నుండి చేపలను పట్టి తేవటముతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి, కృత్రిమముగా, శాస్ర్తియ పద్ధతులలో పెంపకము చేస్తున్నారు (.చేపలపెంపకము-చిప్పగిరిజ్ఞానేశ్వర్) చేపలపెంపకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దాదాపు 6లక్షల ఎకరాలలో చేపట్టారు
ఆహారముగా చేపలు : చేపలు ఆరోగ్యనికి ఛాల మంచిది. చేపల్ని మూడు రకాల ప్రధాన తరహాలుగా గుర్తించవచ్చు .
వీటిలో శరీరంలో తైలం అధికముగా ఉండేవి ఒక రకము -- >సాల్ మన్, మాక్రెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డినెస్ మున్నగునవి .వీటిలో తైలము ఎక్కువ & విటమిను ' ఎ, డి, ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికముగా ఉంటాయి . రెండో రకము ... వైట్ ఫిష్ -> వీటిలో తైలము తక్కువ ., ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ తక్కువగా ఉంటాయి . వీటిని తినడము వల్ల ఆరోగ్యము మెరుగవుతుంది . మూడోరకము -- > నిజానికి చేపలు కావు, అవి రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు వంటివి . వీటిలో ' సెలీనియం, జింక్, అయోడిన్, కాపర్ వంటివి చాలా ఎక్కువగా లభిస్తాయి . మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి .
'బంగారుతీగ' రకం చేపలు మంచినీటిలోనే పెరుగుతాయి. 'ట్యూనా'ల్లాంటివి సముద్రపు నీటిలోనే పెరుగుతాయి. 'బంగారుతీగ' చేప ఉప్పునీటిలో చనిపోతే, 'ట్యూనా' మంచి నీటిలో చనిపోతుంది. ఇలాంటి చేపల్ని 'స్టెనోహాలిన్' చేపలు అంటారు. కానీ 'సాల్మన్, ఈల్'ల్లాంటి చేపలు ఉప్పు, మంచి నీళ్లలోనూ జీవించగలవు. కానీ వీటిని పరిసరాలకు అనుకూలంగా తయారుచేయాలి (అక్లైమెటైజ్). ఇలాంటి చేపలను 'యూరోహాలెన్' రకం చేపలంటారు.
Fish -------Calories ---TotalFat ---Saturated---Protein ---Cholesterol
Ocean-----110 --------2g -----------0g ------------21g----------50 mg
చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియోసిన్, రిబోఫ్లేమిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.
రోజూ చేపలు తినటం మధ్యవయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే.. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గానీ అంతకుమించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపు అవుతోంది. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 40-69 ఏళ్ల వారిని ఎంచుకొని.. వారి ఆహార అలవాట్లు, తదితర అంశాలను పరిశీలించారు. చేపలు, ఎన్-ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవటం వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పులపై ప్రభావాన్ని అంచనా వేశారు. మిగతా వారితో పోలిస్తే రోజూ చేపలు తినేవారిలో ఈ అంశాలు 57 శాతం తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. చేపల్లో దండిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి ట్రైగిజరైడ్ల మోతాదును కూడా తగ్గిస్తాయని వివరించారు. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే ముప్పు ఎక్కువ. తక్కువ నూనెతో వండుకోవటం చాలా అవసరం.
మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి బొజ్జ, రక్తపోటు పెరగకుండా చేస్తూ.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా చేపల గురించి మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వీటిని దండిగా తినేవారికి పెద్దపేగు, మల ద్వారా క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినా.. చేపలతో మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు. చేపలు తినే అలవాటు, క్యాన్సర్లకు గల సంబంధంపై గతంలో చేసిన 41 అధ్యయనాలను క్రోఢీకరించి ఈ ఫలితాలను అంచనా వేశారు. అందువల్ల చేపలను అంతగా తిననివారు వీటిని తరచుగా తీసుకోవటం ద్వారా గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని న్యూజెర్సీ-రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్‌కి చెందిన డాక్టర్ మైఖేల్ గోచ్‌ఫెల్డ్ వివరిస్తున్నారు. అయితే ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అధ్యయన కర్త డాక్టర్ జీ లియాంగ్ హెచ్చరిస్తున్నారు.
చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది.
కొన్ని రకాల చేపలు ఆహారంగా వినియోగించబడగా మిగిలిన భాగములు, తృణీకరించబడిన చేపలు ఎండబెట్టిన పిదప పొడి చేసి చేపల భోజనం (Fish Meal) తయారుచేస్తారు. కోళ్ళు, పందులు, పశువుల పెంపకములో దీనిని ప్రధానమైన కృత్రిమ ఆహారంగా ఉపయోగిస్తారు.
చేపల దాణా తయారీలో చేపల్ని పెద్దపెద్ద పాత్రలలో ఉడకబెట్టుట, బొగ్గులపై కాల్చుట లేదా ఆవిరిలో మెత్తబరుచుట జరుగుతుంది. వీనిలో 60 % మాంసకృత్తులు, ఎక్కువ కాల్షియం, ఫాస్ఫేట్లు, 5.6% నూనెలు ఉంటాయి. అధిక పోషక విలువలను కలిగివుంటాయి. కావున పశువుల్లో పాల దిగుబడి, కోళ్ళలో గుడ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
సొరచేపలు మొదలైన చేపల్లోని అనవసరమైన మాంసమును చిన్నచిన్న ముక్కలుచేసి, కడిగి 80 వద్ద సజల ఎసిటికామ్లములో ఉడకబెట్టబడుతుంది. తర్వాత దీనిని ఆమ్లము, క్రొవ్వుల నుంచి శుద్ధిపరచుటకై నీటితో, పెట్రోలియంతో కడుగుతారు. దీనిని పొడిగాలిలో ఆరబెట్టిన పిదప 10 % కాస్టిక్ సోడాలో 80 వద్ద జలవిశ్లేషణ చేయాలి. మాంసం లోని ప్రోటీన్లు ద్రావణ రూపంలోకి మారతాయి. ఈ ద్రావణమును ఎసిటికామ్లముతో తటస్థపరచి ఆవిరిపై ఇగిర్చినప్పుడు సహజ పరిమళముగల మెత్తని పొడి తయారవుతుంది. దీనిలో 35 % మాంసకృత్తులుంటాయి.
జలవిశ్లేషిత ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. కావున పోషక పదార్ధాల లోపముగలవారు అధికంగా వినియోగించడానికై సరఫరా చేయబడుతుంది. 10 % ఈ పొడి 90 % గోధుమ పిండితో కలిపి రొట్టెలు, బిస్కట్లు, కేక్ లు తయారీలో కూడా వాడవచ్చును.
గంబూజియా, ఇసోమస్, ఖీలా, పుంటియస్, బెరీలియస్, డానియో, అంబాన్సిస్, పాంఛాక్స్ వంటి చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. కావున ఇలాంటి చేపలను రిజర్వాయిర్లలో, బావులలో, చెరువులలో వాడుట ద్వారా దోమల సంతానాన్ని నియంత్రించి వానిద్వారా మానవులలో సంక్రమించే మలేరియా, బోద వ్యాధుల వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. తెగిపోయిన అవయవాల స్థానంలో కొత్త అవయవాలను తయారు చేసుకోగలిగే సామర్థ్యం ఫ్లాట్ వార్మ్ ప్లానేరియా అనే చేపకుంది. ప్లానేరియా చేప 32 ముక్కలుగా విడిపోయిన తరువాత.. ప్రతి ముక్కకు తల, కళ్లు ఇలా అన్ని అ వయవాలు, అవయవ వ్యవస్థలు ఏర్పడి పూర్తిస్థాయి చేపలుగా మనుగడ సాగించగలదు.
చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి గాఢనిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.