మక్కా మసీదు (హైదరాబాదు)
From Wikipedia, the free encyclopedia
Remove ads
మక్కా మస్జిద్ (హైదరాబాదు, భారతదేశం) భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది, 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.


చార్మినారుకు నైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉంది. ఈ మస్జిద్ లో మహమ్మదు ప్రవక్త యొక్క "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
Remove ads
చరిత్ర
1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది, 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది. 1830లో తన కాశీయాత్రలో హైదరాబాద్‌ను తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య పర్యటించారు. ఆయన కాశీయాత్రచరిత్రలో వ్రాస్తూ షహరు నడుమ మక్కామజ్జిత్ అనే తురకల జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడియున్నవి కనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి. అని వర్ణించారు.[1]
Remove ads
మస్జిద్ ప్రాంగణం

ఈ మస్జిద్ ప్రాంగణంలో సమాధుల సమూహము, మక్కా మస్జిద్ ఇస్లామీ గ్రంథాలయం ఉన్నాయి.
మస్జిద్ వద్ద బాంబు పేలుడు
హైదరాబాదు లోని ప్రాచీన మక్కా మసీదు వద్ద 2007 మే 18 న బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 11 మంది చనిపోయారు. పేలుడు తరువాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.[2]
చిత్రమాలిక
- మక్కా మస్జిద్ ముందు భాగాన గల మీనార్ల సుందర దృశ్యం.
- మక్కా మస్జిద్, కుడి మీనారు దృశ్యం
- మక్కా మస్జిద్ కమానులలో ఒక కమాను.
ఇవీ చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads