From Wikipedia, the free encyclopedia
మంత్ర 2007 డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. తులసీ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చార్మీ కౌర్, జీవా, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, చిత్రం శీను, విజయ్ తదితరులు నటించగా, కమలాకర్ సంగీతం అందించాడు. 2015 లో దీని సీక్వెల్, మంత్ర 2 విడుదలైంది.
మంత్ర (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తులసీ రామ్ |
---|---|
నిర్మాణం | రవి ప్రకాష్ కళ్యాణ్ రామ్ |
తారాగణం | శివాజీ చార్మీ కౌర్ జీవా మల్లికార్జునరావు రాళ్ళపల్లి చిత్రం శీను విజయ్ |
సంగీతం | ఆనంద్ |
ఛాయాగ్రహణం | శివేంద్ర |
కూర్పు | ఉపేంద్ర |
విడుదల తేదీ | 14 డిసెంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మంత్ర తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోతారు. ఆమె తన స్నేహితుడు విన్నీతో నివసిస్తుంది. ఆమె హైదరాబాద్ శివార్లలో 'మంత్ర నిలయం' అనే పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ వ్యవసాయ గృహంలో రెండు అకాల మరణాలు సంభవిస్తాయి. ఆ కారణంగా మంత్రాయంను దయ్యాల కొంపగా పిలుస్తారు. ఆమె దానిని అమ్మాలనుకుంటుంది. కానీ దానికున్న పేరు కారణంగా ఆ ఆస్తిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఎవరైనా అక్కడ మూడు నెలలు ఉంటే తాను ఆ ఆస్తిని కొంటానని ఒక ప్రొఫెసరు ముందుకు వస్తాడు. హీరో (శివాజీ) ఒక చిన్నపాటి గూండా. అతను భూమి సెటిల్మెంట్లు చేస్తూంటాడు. 'మంత్ర నిలయం' అమ్మిన తర్వాత అమ్మకం కమీషన్ వస్తుందనే ఉద్దేశంతో తాను ఆ మూడు నెలలు అందులో ఉండాలనుకుంటాడు. హీరో మంత్రనిలయంలో ఎలా ఉంటాడనేది మిగతా కథ.
ఈ చిత్రం 2007 డిసెంబరు 14 న విడుదలైంది. 80 నుండి 90% కలెక్షన్లతో విజయవంతమైంది.[1][2] సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు చిత్ర పరిశ్రమలో జనాదరణ పొందిన కథ కాదు , అరవింద్ రచించిన ఎ ఫిల్మ్ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించింది.[3] తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ వెబ్సైట్ ఐడిల్బ్రెయిన్ ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది.[4] విజయానంద్ మూవీస్ ఈ సినిమా యొక్క థియేట్రికల్ హక్కులను భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. భవానీ మీడియా, డివిడి హక్కులను సొంతం చేసుకుంది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.