మంగళవారం (Tuesday), అనేది వారంలో మూడవ రోజు. ఇది సోమవారంనకు, బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు.ఈ వారం గణేశుడు. దుర్గా, హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంనాడు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.రాత్రిపూట ఉప్పుతో కలిగిన ఆహారం తొందరగా తీసుకుంటారు. గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్రహానికి అంకితం చేయబడింది.మంగళవారం, లేదా మంగళ్ రోజును యుద్ద దేవుడు శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు వైదొలగటానికి, హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు.ఆరోజు ఒకసారి భోజనం సాధారణంగా గోధుమ, బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు.కొంత మంది ప్రజలు విరామం లేకుండా 21 మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు.ఆరోజు ఆంజనేయుడుకు ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. కొన్ని భక్త సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజల ద్వారా ఆరాధిస్తూ ఉంటాయి.దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మురుగ లేదా కార్తికేయ (కార్తీక్) కు అంకితం చేయబడింది.కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవరం వ్రతాన్ని చేసుకుంటారు.[1]
ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగే సంఘటనలు:
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బోర్డు జనవరి నెలలో తప్ప మిగతా పదకొండు నెలలలో ప్రతి నెల మొదటి మంగళవారం సమావేశమవుతుంది.[2]
- ఫెడరల్ ప్రభుత్వం మే రెండవ మంగళవారం ఫెడరల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది.1994 నుండి 1996 వరకు, 2016 మినహా అన్ని సంవత్సరాల్లో ఈ పద్ధతి జరిగింది.[3]
- మెల్బోర్న్ కప్ డే అనే గుర్రపు పందాలపోటీ ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి మంగళవారం జరుగుతుంది.వార్కి ఆరోజు శలవుదినం.[4]
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.