భైరవసెల

From Wikipedia, the free encyclopedia

శైలంలోని ప్రధాన ఆలయానికి ఆగ్నేయంగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ‘భైరవసెల’ ఉంది. ఇక్కడికి చేరాలంటే శ్రీశైలం - దోర్నాల మార్గంలో 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడి నుంచి కుడివైపు అడవి మార్గంలో మూడుకిలోమీటర్లు కొండ దిగితే భైరవసెలను చేరుకోవచ్చు. ఈ వాగును భయన్న వాగు అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి కిలోమీటరు దూరంలో సెలయేరు, దానికి అవతల వైపు గుహ, జలపాతం కనిపిస్తాయి. ఈ గుహను భైరవ గుహ అని, భయన్న గుహ అని పిలుస్తారు. ఉత్తర ముఖంగా ఉన్న ఈ గుహలో భైరవుడు కొలువుదీరాడు. ఈ గుహలో భైరవునికి ఎడమవైపు చెంచుల దైవం భయన్న ఉంటాడు. భయన్నకు రూపం లేదు. నిరాకారమైన నాలుగు శిలలనే భయన్నగా భావించి పూజిస్తారు.

భైరవ సెలలో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొండ గుట్టల పై నుంచి అంచెలు అంచెలుగా జారిపడే ఈ జలపాతాల శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలతో మది పులకరించిపోయే పరిసరాలు భైరవసెలకు ఆభరణాలుగా ఉన్నాయి.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.