భూతం ముత్యాలు
తెలుగు కవి, రచయిత From Wikipedia, the free encyclopedia
భూతం ముత్యాలు తెలుగు కవి, రచయిత. దళితుల సమస్యలపై అతను అనేక రచనలు, కవిత్వాలు రాసాడు.[1]
భూతం ముత్యాలు | |
---|---|
![]() భూతం ముత్యాలు | |
Born | భూతం ముత్యాలు 10 జూన్ 1971 నల్గొండ జిల్లా లోని నాంపల్లి మండలానికి చెందిన తిరుమల గిరి |
Occupation | రచయిత, ఉపాధ్యాయుడు |
Citizenship | భారతీయుడు |
Subject | దళిత సాహిత్యం |
Spouse | విమల |
Children | జయప్రకాశ్,ఉషారాణి,జ్యోతిరాణి |
జీవిత విశేషాలు
భూతం ముత్యాలు నల్గొండ జిల్లా లోని నాంపల్లి మండలానికి చెందిన తిరుమల గిరి గ్రామంలో మల్లయ్య, మల్లమ్మ దంపతులకు 1971 జూన్ 10న జన్మించాడు. ప్రాథమిక విద్యను తిరుమలగిరిలోనూ, ఉన్నత విద్యను నల్గొండ లోనూ చదివాడు. హైదరాబాదులోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చేసాడు. గోకుల్ కళాశాలలో బి.యిడి చేసాడు. హైదరాబాదులో కళాశాల విద్యనభ్యసించే కాలంలో స్వంత ఖర్చుల నిమిత్తం సాయంత్రం వేళల్లో రిక్షా లాగడం, హోటళ్ళలో పనిచేయడం వంటి వృత్తులను నిర్వహించాడు. 1996లో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొంది ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
అతను సాహితీ రంగంలో రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బాల్యం నుండి కవితలు, రచనలు చేసేవాడు.అతనిపై కాళోజీ నారాయణరావు రచనలు ప్రభావం చూపాయి. అతనికి రచనలంటే యిష్టం.
రచనలు
- దుగిలి (దళిత కవిత్వం) - 2003[2]
- సూర (దళిత జీవితం రెండు తరాల కుటుంబ వ్యధ) - 2004: ఈ పుస్తకాన్ని కాకతీయ యూనివర్శిటీ తెలుగు 4వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టుగా పెట్టారు.
- పురుడు (మాలల సంస్కృతి , జీవితాల గురించి) - 2007
- బేగరి కథలు ( దళిత మైనార్టీల గురించి ) - 2010
- ఇగురం (నవల) - 2012
- మాండలికం (తెలంగాణ కుల వృత్తి పదకోశం) - 2013
- బుగాడ కథలు (దళిత జీవితాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన కథలు) - 2014
- నియతి ( నా ఆటో గ్రఫి ) - 2015
- దగ్ధం కథలు - 2017
- కులాత్కమ్ - నాటకం - 2017
- మాలవారి చరిత్ర - 2018
- మాల పల్లె కథలు- 2020
- మాలచ్చువమ్మ (నవల) - 2021 [3]
పురస్కారాలు
- 2017 సంవత్సరానికి రాసిన మొగలి నవల రచనకు ఉత్తమ నవలా విభాగంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం పొందాడు.[4]
- 2017 జూన్ 2 న తెలంగాణా రాష్ట్ర సాహిత్య పురస్కారం నల్లగొండ జిల్లా స్థాయిలో స్వీకారం
- 2017 సంవత్సరానికి నల్గొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు
- 2019 సంవత్సరానికి B.S.రాములు ప్రతిభా విశాల సాహితీ పురస్కారం అందుకున్నారు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.