From Wikipedia, the free encyclopedia
భూమి ఉపరితలం దగ్గరలో వున్న మట్టిలో పొరలలో కనపడే నీటిని కాకుండా ఇంకనూ లోపల రాతి పొరలలో ఉంటూ, పారే నీటిని భూగర్భ జలం (Ground Water) అని అంటారు. భూగర్భం లోని రాళ్ళ స్వభావాన్ని బట్టి భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితులు మారుతుంటాయి. మన రాష్ట్రంలో పలు రకాల రాళ్ళు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం గట్టి రాళ్ళే ఉన్నాయి. గట్టి రాళ్ళలో నీరు నిలువడానికి, పారడానికి కావాల్సిన గుణాలు తక్కువ. అందుకే మన రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో భూగర్భ జలం సాధారణంగా తక్కువగా లభిస్తుంది. దానికి తోడు ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తక్కువ కావడంతో కరువులు తరచుగా ఏర్పడతాయి.
గోదావరి నది ప్రవహించే అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మమ్ జిల్లాల్లో నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఇసుక రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళల్లో భూగర్భ జలం చాలా సమృద్దిగా దొరుకుతుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోను, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడివున్న ఇసుక పొరల్లో అపారమైన భూగర్భ జల సంపద ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.