2014లో ఉదయశంకర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం From Wikipedia, the free encyclopedia
భీమవరం బుల్లోడు 2014 లోవచ్చిన రొమాంటిక్ చిత్రం. కవి కాళిదాసు రచించగా ఉదయశంకర్ దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో సునీల్, ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, సంతోష్ రాయ్ పథాజే ఛాయాగ్రహణం, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు విభాగాలను నిర్వహించారు.
భీమవరం బుల్లోడు | |
---|---|
దర్శకత్వం | ఉదయశంకర్ |
రచన | కవి కాళిదాస్ (కథ) శ్రీధర్ శీపన (సంభాషణలు) ఉదయ్‌శంకర్ (చిత్రానువాదం) |
నిర్మాత | దగ్గుబాటి సురేష్ బాబు |
తారాగణం | సునీల్ ఎస్తేర్ నొరోన్హా తణికెళ్ళ భరణి |
ఛాయాగ్రహణం | సంతోష్‌రాయ్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | సురెష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 27 ఫిబ్రవరి 2014 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹ 7కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹ 25కోట్లు[1] |
మెదడులో కణితి ఉన్న ఒక యువకుడి కథ ఇది. అతను తన చుట్టూ ఉన్న రౌడీయిజాన్ని రూపు మాపడానికి నడు కడతాడు. అతను పనిని మొదలెట్టిన తర్వాత తాను క్యాన్సర్ రోగి కాదని తెలుసుకుంటాడు. ఈ చిత్రం 2014 ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[2] ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలను అందుకుంది,[3] కానీ బాక్సాఫీస్ వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి.[4]
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఒక వైపు నువ్వు" | అనూప్ రూబెన్స్, సైంధవి | 4:09 | ||||||
2. | "సూపర్మానులా" | ధనుంజయ్, ప్రణతి, పృథ్వి, రాంకీ | 3:47 | ||||||
3. | "ప్రేమలో పడ్డానురా" | సురభి శ్రావణి, విజయ్ ప్రకాష్ | 4:18 | ||||||
4. | "పల్లకితో వస్తేనే" | రాజా హసన్, రమ్య ఎన్.ఎస్.కె | 4:20 | ||||||
5. | "భీమవరం బుల్లోడా" | అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళే, మేఘరాజ్ | 2:11 | ||||||
6. | "ఒకవైపు నువ్వు" | అనూప్ రూబెన్స్, సైంధవి | 3:43 | ||||||
22:28 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.