భారతదేశంలోని మాజీ రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
భారతీయ క్రాంతి దళ్ అనేది ఒక రాజకీయ పార్టీ. దీనిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ స్థాపించాడు. 1967 అక్టోబరులో లక్నోలో జరిగిన సమావేశంలో పార్టీ స్థాపించబడింది.[1] 1977 సాధారణ ఎన్నికల తరువాత, భారతీయ క్రాంతి దళ్ వారసుడు, భారతీయ లోక్ దళ్ జనతా పార్టీలో విలీనం చేయబడింది.[2]
భారతీయ క్రాంతి దళ్ | |
---|---|
స్థాపకులు | చరణ్ సింగ్ |
స్థాపన తేదీ | 1967 అక్టోబరు |
రంగు(లు) | ఆకుపచ్చ |
Election symbol | |
హుమాయున్ కబీర్ ఢిల్లీలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో 1967 ఏప్రిల్ 9న భారతీయ క్రాంతి దళ్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి.[3] 1967 నవంబరులో భారతీయ క్రాంతి దళ్ ఇండోర్ సమావేశంలో, మహామాయ ప్రసాద్ సిన్హా పార్టీ మొదటి ఛైర్మన్గా ఎన్నికయ్యాడు.[3]
1967లో ఈ పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్లతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ కూటమిని ఏర్పాటుచేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.