From Wikipedia, the free encyclopedia
భానుప్రతాపూర్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాంకేర్ జిల్లా, కంకేర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్గఢ్ |
అక్షాంశ రేఖాంశాలు |
ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,186 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 92,669 మంది పురుషులు, 97,513 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ స్థానానికి 2022 డిసెంబరు 5న జరిగిన ఉప ఎన్నికలో 71.74% ఓటింగ్ నమోదైంది.
2018 ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో 77.25%, 2013లో 79.19%, 2008లో 65.8% ఓటింగ్ నమోదైంది.
2013లో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ సింగ్ మాండవి 14,896 ఓట్ల (10.56%) మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో మనోజ్ సింగ్ మాండవికి 45.98% ఓట్లు వచ్చాయి.
2008 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 38.45% నమోదై 15,479 ఓట్ల (14.38%) తేడాతో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది.
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2023[3][4][5] | సావిత్రి మనోజ్ మండవి | భారత జాతీయ కాంగ్రెస్ |
2022 డిసెంబరు 5 (ఉప ఎన్నిక) | సావిత్రి మనోజ్ మండవి | భారత జాతీయ కాంగ్రెస్[6] |
2018[7][8] | మనోజ్ సింగ్ మాండవి | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[9][10] | మనోజ్ సింగ్ మాండవి | భారత జాతీయ కాంగ్రెస్ |
2008[11] | బ్రహ్మానంద్ | భారతీయ జనతా పార్టీ |
2003[12] | డియోలాల్ దుగ్గా | భారతీయ జనతా పార్టీ |
2018 సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో ఆయన భార్య కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మాండవి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన బ్రహ్మానంద్ నేతమ్పై 21,171 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. శ్రీమతి మాండవికి 65,479 ఓట్లు రాగా, బీజేపీ నేత 44,308 ఓట్లు వచ్చాయి.
Seamless Wikipedia browsing. On steroids.