భబువా
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
భబువా బీహార్ రాష్ట్రం, కైమూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.[1] భబువాను ఇంతకు ముందు అఖ్లాష్పూర్, ఆజాద్ నగర్, నవాబీగంజ్ అని కూడా పిలిచేవారు. పాత పట్టణాన్ని నవాబ్ గంజ్ అనీ, నవాబీ ముహల్లా అనీ అంటారు. దీన్ని దివాన్ రామ్ రావు వారసులు స్థాపించారు. రెండు తరాల తరువాత ఈ వంశీకులే జమీందార్ అఖ్లాష్ ఖాన్ పేరు మీద అఖ్లాష్పూర్, జమీందార్ ఆజాద్ ఖాన్ పేరు మీద ఆజాద్ నగర్ లను స్థాపించారు [2]
భబువా
నవాబీగంజ్
అఖ్లాష్‌పూర్ ఆజాద్‌నగర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25.05°N 83.62°E | |
దేసం | India |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
జిల్లా | కైమూర్ |
Founded by | రాజా దివాన్ రామ్ రావ్ |
Boroughs | 25 |
Elevation | 76 మీ (249 అ.) |
జనాభా (2011) | |
• Total | 50,179 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 821101 |
టెలిఫోన్ కోడ్ | 06189 |
Vehicle registration | BR-45 |
Website | www.kaimur.bih.nic.in |
భౌగోళికం
భబువా 25.05°N 83.62°E నిర్దేశాంకాల వద్ద ఉంది.
చరిత్ర
భబువాను ఉత్తర ప్రదేశ్ లోని గాజీపూర్ రాజు, షికర్వార్ రాజపుత్ర వంశానికి చెందిన దివాన్ రామ్ రావు వారసులు స్థాపించారు.[3]
కైమూర్ జిల్లా క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం నుండి శక్తివంతమైన మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీస్తుశకం 5 వ శతాబ్దం వరకు, మౌర్య సామ్రాజ్యం లోను, మగధ గుప్తుల పాలకుల క్రింద ఉండేది. సా.శ. 7 వ శతాబ్దంలో ఈ జిల్లా కన్నౌజ్ పాలకుడు హర్షవర్ధనుడి ఆధీనంలోకి వచ్చింది. భబువా సమీపంలోని ముండేశ్వరి ఆలయంలోని ఒక శాసనం ఉదయసేన రాజు ఈ ప్రాంతానికి అధిపతిగా ఉండేవాడని సూచిస్తోంది.
రవాణా
హౌరా-న్యూ ఢిల్లీ రైలుమార్గంలో భబువా రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది భబువా పట్టణం నుండి ఉత్తరాన సుమారు 14 కి.మీ. దూరంలో ఉంది. పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్, మహాబోధి ఎక్స్‌ప్రెస్, పూర్వా ఎక్స్‌ప్రెస్, కాల్కా మెయిల్, ముంబై మెయిల్, డూన్ ఎక్స్‌ప్రెస్, చంబల్ ఎక్స్‌ప్రెస్, షిప్రా ఎక్స్‌ప్రెస్, సీల్డా ఎక్స్‌ప్రెస్, బుద్ధపూర్ణిమ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ - అసన్సోల్, దీక్షాభూమి ఎక్స్‌ప్రెస్, జోధ్పూర్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్, రాంచీ - వారణాసి ఎక్స్‌ప్రెస్, జార్ఖండ్ ఎక్స్‌ప్రెస్, సాసారం - ఆనంద్ విహార్ టెర్మినస్ ఎసి ఎక్స్‌ప్రెస్ మొదలైన రైళ్ళు ఈ స్టేషను గుండా వెళ్తాయి. ఈ పట్టణం రహదారి ద్వారా పాట్నా నుండి 195 కి.మీ, వారణాసి నుండి 84 కి.మీ. దూరంలో ఉంది
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.