భబాతోష్ దత్తా

From Wikipedia, the free encyclopedia

భబాతోష్ దత్తా ( 1911 ఫిబ్రవరి 21 – 1997 జనవరి 11) ఒక భారతీయ ఆర్థికవేత్త, విద్యావేత్త, రచయిత, కవి. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[1]

త్వరిత వాస్తవాలు భబాతోష్ దత్తా, జననం ...
భబాతోష్ దత్తా
జననం(1911-02-21)1911 ఫిబ్రవరి 21
మరణం1997 జనవరి 11(1997-01-11) (వయసు: 85)
సమాధి స్థలం23°15′37″N 88°31′52″E
జాతీయతభారతీయుడు
వృత్తిఆర్థికవేత్త, విద్యావేత్త, రచయిత, కవి.
జీవిత భాగస్వామిఅమలా దత్త
తల్లిదండ్రులుహేమేంద్ర కిషోర్ దత్తా
జోగ్మయ దత్తా
పురస్కారాలుపద్మవిభూషణ్ (1990)
మూసివేయి

తొలినాళ్ళ జీవితం

ఈయన 1911, ఫిబ్రవరి 21 న హేమేంద్ర కిషోర్ దత్తా, జోగ్మయ దత్తా దంపతులకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో  జన్మించాడు. ఈయన తండ్రి పాట్నాలోని బీహార్ నేషనల్ కాలేజీలో రసాయన శాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈయన తన ప్రాథమిక విద్యను ఖుల్నా జిల్లాలోని దౌలత్‌పూర్, మైమెన్‌సింగ్‌లో (ప్రస్తుతం ఈ ప్రాంతం బంగ్లాదేశ్లో ఉంది) పూర్తిచేసాడు. ఈయన తన పాఠశాల విద్యలో తోటి విద్యార్థి బుద్ధదేబ్ బోస్‌తో కలిసి పాఠశాల పత్రికను సవరించాడు. ఈయన తన బి.ఎ. (హన్స్.) ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఎమ్.ఎ. ఎకనామిక్స్ ను  కోల్‌కతా లోని ప్రెసిడెన్సీ కాలేజీలో పూర్తిచేసాడు.[2]

కెరీర్

ఈయన చిట్టగాంగ్ కళాశాల, బుర్ద్వాన్ రాజ్ కాలేజీ, ఇస్లామియా కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. 1948 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన డాక్టరల్ కోసం ఇంగ్లాడ్ వెళ్ళాడు. ఈయన చేసిన పరిశోధన కలకత్తాలో ది ఎకనామిక్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ (1952) లో ప్రచురించబడింది. 1952 లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. ఈయన దక్షిణ ఆసియా విభాగానికి చీఫ్ గా ఐ. ఎమ్. ఎఫ్ లో పనిచేశాడు. 1956 లో భారతదేశానికి తిరిగి వచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. ఈయన 1962 లో పదవీ విరమణ చేసే వరకు డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తూనే ఉన్నాడు. పదవీ విరమణ తరువాత కళాశాలలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఆ తరువాత రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖలో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్, జనరల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేశాడు. ఈయన 1965 లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విద్యా కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన 1964 లో ఏర్పడిన ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఈయన కోల్‌కతాలోని పస్చింబంగా బంగ్లా అకాడమీ యొక్క మొదటి వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[2][3]

పురస్కారాలు

ఈయనకు 1990లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

వ్యక్తిగత జీవితం

ఈయన 1939లో అమలా బసును వివాహం చేసుకున్నాడు. కానీ ఈమె 1989లో మరణించింది.

మరణం

ఈయన 1997, జనవరి 11 న మరణించాడు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.