From Wikipedia, the free encyclopedia
బోరిస్ పాస్టర్నాక్ (ఫిబ్రవరి 10, 1890 - మే 30, 1960) రష్యా దేశానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు. 1957లో బోరిస్ రాసిన డాక్టర్ జివాగో నవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చింది.[1]
బోరిస్ పాస్టర్నాక్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | బోరిస్ లియోనిడోవిచ్ పాస్టర్నాక్ ఫిబ్రవరి 10, 1890 మాస్కో, రష్యన్ సామ్రాజ్యం |
మరణం | మే 30, 1960 పెరెడెల్కినో, సోవియట్ యూనియన్ |
వృత్తి | కవి, రచయిత, అనువాదకుడు |
పౌరసత్వం | రష్యన్ సామ్రాజ్యం (1890–1917) సోవియట్ రష్యా (1917-1922) (1917–1922) సోవియట్ యూనియన్ (1922–1960) |
గుర్తింపునిచ్చిన రచనలు | మై సిస్టర్, లైఫ్, ది సెకండ్ బర్త్, డాక్టర్ జివాగో |
పురస్కారాలు | నోబెల్ బహుమతి (1958) |
బోరిస్ 1890, ఫిబ్రవరి 10న రష్యన్ సామ్రాజ్యంలోని మాస్కోలో జన్మించాడు.[2] తండ్రి చిత్రకారుడు, తల్లి పియానో విద్వాంసురాలు. తన తల్లి ప్రభావంతో 14వ ఏట నుంచి దాదాపు ఆరేండ్లపాటు సంగీతంను నేర్చుకున్నాడు.
సంగీతాన్ని పక్కన పెట్టిన బోరిస్ సాహిత్యం వైపు అడుగులు వేశాడు. గోయిదే, షేక్స్పియర్ రచనలను, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కవితలను రష్యన్ భాషలోకి అనువదించాడు. 1905 కాలపు రష్యా విప్లవానికి, రెండో ప్రపంచ యుద్ధానికి మధ్యకాలంలో జరిగిన రష్యన్ దేశ పరిణామాలను, కమ్యూనిస్టుల పాలనలోని నేతల తీరును, ప్రజల్లోని నైరాశ్యాన్ని, కమ్యూనిస్ట్ స్వర్గంలోని చీకటి కోణాలను ప్రపంచానికి వెల్లడిచేస్తూ 1957లో డాక్టర్ జివాగో నవల రాశాడు. ఈ నవల ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరును తీసుకురావడమేకాకుండా, సినిమాగా కూడా తీయబడింది.
బోరిస్‌కు 1958లో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. కానీ రష్యన్ ప్రభుత్వం బోరిస్‌పై ఆంక్షలనుప్రకటించడంతో, బోరిస్ నోబెల్ బహుమతిని తిరస్కరించాడు.
బోరిస్ 1960, మే 30న సోవియట్ యూనియన్ లోని పెరెడెల్కినోలో మరణించాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.