From Wikipedia, the free encyclopedia
బోండాం పెళ్ళి 1940లో విడుదలైన తెలుగు సినిమా. మద్రాసు యునైటెడ్ ఆర్టిస్ట్ కార్పొరేషన్ బ్యానర్ కింద నిర్మించబడిన ఈ సినిమాకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఎల్.వి.ప్రసాద్, జి.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించారు.[1][2][3] 1940 డి.రామచంద్రన్ దర్శకత్వం వహించిన బారిష్టరు పార్వతీశం హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన 'బోండాం పెళ్లి' చిత్రం జంటగా విడుదలైంది.[4] రంగస్థలంపై నటించాలనే మక్కువతో తన 11వ యేట యింటి నుండి వెళ్ళిపోయిన జి.వరలక్ష్మి నాటక కళాకారులు తుంగల చలపతి రావు, దాసరి కోటిరత్నంతో కలిసి నటించింది. ఆమె సక్కుబాయి, రంగూన్ రౌడీ వంటి నాటకాలలో ఆమె పాత్రలకు ప్రజాదరణ పొందింది. ఆమె మొదటి సినిమాలు నిర్మాత రఘుపతి ప్రకాష్ తీసిన బారిస్టర్ పార్వతీశం, నిర్మాత హెచ్‌ఎం తీసిన బొండాం పెళ్లి.[5]
బోండాం మారేజ్ (1940 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
---|---|
తారాగణం | ఎల్వీ ప్రసాద్, జి.వరలక్ష్మి |
నిర్మాణ సంస్థ | మద్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పోరేషన్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
Seamless Wikipedia browsing. On steroids.