From Wikipedia, the free encyclopedia
బొగ్గారపు దయానంద్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1][2]
బొగ్గారపు దయానంద్ | |||
ఎమ్మెల్సీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 నవంబరు 15 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1954 మే 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు, వజ్రమ్మ | ||
జీవిత భాగస్వామి | సుజాత | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
దయానంద్ 1954, మే 3న రాములు, వజ్రమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[3] బిఎస్సీ చదువుకున్నాడు.[1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి 2003లో స్వచ్చంధ పదవీ విరమణ చేశాడు.
దయానంద్ కు సుజాతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
2003లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2009 - 2014 మధ్యకాలంఓ గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి టిడిపి బిజినెస్ సెల్ రాష్ట్ర కమిటీ అభ్యర్థిగా పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2020, నవంబరు 15న టిఆర్ఎస్ పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్గా నియమితుడయ్యాడు.[6] ఆయన 2024 జులై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7]
నేపాల్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలలో పర్యటించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.