బెల్లంకొండ సురేష్

From Wikipedia, the free encyclopedia

బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.

త్వరిత వాస్తవాలు బెల్లంకొండ సురేష్ రెడ్డి, జననం ...
బెల్లంకొండ సురేష్ రెడ్డి
జననం (1965-12-05) 1965 డిసెంబరు 5 (age 59)
వృత్తిచలనచిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామిబెల్లంకొండ పద్మావతి
పిల్లలుబెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ గణేష్ బాబు
మూసివేయి

జీవిత చరిత్ర

బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

వివాదం

టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.