From Wikipedia, the free encyclopedia
బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) లోని శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం 1962 నుంచి ఏర్పడి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పినపాక శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈ నియోజకవర్గంలో 1962 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికతో సహా 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు, సీపీఐ ఐదుసార్లు, టీడీపీ, ఇండిపెండెంట్, వైసీపీలు చెరొక్క సారి గెలుపొందాయి.[1][2]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1962 | 282 | బూర్గంపాడు | (ఎస్టీ) | కంగల బుచ్చయ్య | మహిళా | సిపిఐ పార్టీ | 22257 | కొమరం రామయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 22215 |
1967 | ఉప ఎన్నిక | ఇల్లందు | (ఎస్టీ) | కె.రామయ్య | పు | స్వతంత్ర | ఏకగ్రీవ ఎన్నిక[3] | ||||
1967 | 269 | బూర్గంపాడు | (ఎస్టీ) | ఆర్. కొమరం | పు | కాంగ్రెస్ పార్టీ | 27631 | చీమల | పు | స్వతంత్ర | 13607 |
1972 | 269 | బూర్గంపాడు | (ఎస్టీ) | కామారం రామయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 30220 | గోగుల సీతయ్య | పు | స్వతంత్ర | 22163 |
1978 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | పూనెం రామచంద్రయ్య[4] | పు | కాంగ్రెస్ పార్టీ | 21287 | పాయం మంగయ్య | పు | కాంగ్రెస్ (ఐ) | 20256 |
1983 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | ఊకే అబ్బయ్య | పు | సిపిఐ | 17524 | చందా లింగయ్య | పు | స్వతంత్ర | 15803 |
1985 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | చందా లింగయ్య | పు | కాంగ్రెస్ | 36947 | ఊకే అబ్బయ్య | పు | సీపీఐ | 34719 |
1989 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | కుంజా భిక్షం | పు | సీపీఐ | 46179 | చందా లింగయ్య | పు | కాంగ్రెస్ | 41347 |
1994 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | కుంజా భిక్షం | పు | సీపీఐ | 56946 | చందా లింగయ్య | పు | కాంగ్రెస్ | 37132 |
1999 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | తాటి వెంకటేశ్వర్లు | పు | టీడీపీ | 45904 | చందా లింగయ్య | పు | కాంగ్రెస్ | 42976 |
2004 | 275 | బూర్గంపాడు | (ఎస్టీ) | పాయం వెంకటేశ్వర్లు | పు | సిపిఐ | 68080 | తాటి వెంకటేశ్వర్లు | పు | టీడీపీ | 52279 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.