Remove ads
హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 9 జిల్లాలలో బిలాస్పూర్ జిల్లా ఒకటి. ఇక్కడ సట్లెజ్ నదిపై గోవింద్ సాగర్ అనే మానవనిర్మితమైన సరస్సు ఉంది. ఇది బాక్రానంగల్ ఆనకట్ట వలన ఏర్పడినది. ఇక్కడి వంతెన పైనున్న రహదారి ఆసియాలోనే రెండవ అతి పెద్ద వంతెన. ఈ జిల్లా ముఖ్య పట్టణం బిలాస్పూర్. ఈ జిల్లా వైశాల్యం 1167 చదరపు కిలోమీటర్లు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 3,82,956. జనాభా పరంగా ఈ జిల్లా హిమాచల్ ప్రదేశ్ లో మూడవ స్థానంలో ఉంది.[1]
బిలాస్పూర్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | బిలాస్పూర్ (హిమాచల్ ప్రదేశ్) |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,167 కి.మీ2 (451 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,82,056 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (850/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
బిలాస్పూర్ ప్రాంతాన్ని గతంలో ఖహ్లూర్ అనేవారు. బ్రిటిషు పాలనలో ఇది ఒక సంస్థానంగా ఉండేది. 1948 అక్టోబరు 12 న ఈ సంస్థానం భారత్ లో విలీనమైంది. ఆ తర్వాత ఈ ప్రాంతం బిలాస్‌పూరు జిల్లాగా 1954 జూలై 1 న అవతరించి హిమాచల్ ప్రదేశ్ లో భాగమైంది. 7వ శతాబ్దంలో స్థాపించబడిన రాజ్యానికి కహ్లూర్ అనే రాజ్యానికి కహ్లూర్ రాజధానిగా ఉండేది. దాని పేరిట ఆ రాజ్యానికి కహ్లూర్ అనే పేరు వచ్చింది. ఆ తరువాత దానికి బిలాస్పూర్ రాజధాని అయినపుడు రాజ్యం పేరు కూడా బిలాస్పూర్ అయింది. ప్రస్తుత మద్యప్రదేశ్ లోని చందేరి రాజవంశానికి చెందిన చందేలా రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బిలాస్పూర్ పట్టణాన్ని 1663లో స్థాపించారు. ఈ రాజ్యం బ్రిటిషు వారి కాలంలో సంస్థానంగా మారి, బ్రిటిష్ ప్రభుత్వ పంజాబ్ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
19665 లో " రాజా దీప్ చంద్ ఆఫ్ బిలాస్పూర్ " మరణించినపుడు శ్రద్ధాంజలి ఘటించేందుకు గురు తేజ్ బహదూర్ 1665 మే 13న బిలాస్పూర్ వెళ్ళాడు. బిలాస్పూర్ రాణి చంపా, గురు తేజ్ బహదూర్‌కు తనరాజ్యంలో కొంత భూమిని ఇచ్చింది. ఈ భూభాగంలో లోధీపూర్, మైన్పూర్, సహోటా గ్రామాలు ఉన్నాయి. మఖోవల్ గుట్ట వద్ద గురు తేజ్ బహదూర్ సరికొత్తగా ఆశ్రమం నిర్మించుకున్నాడు. 1965 జూన్ 19న బాబా గురుదత్త రణ్‌ధావా శంకుస్థాపన చేసాడు. కొత్త గ్రామానికి గురువు తన తల్లి జ్ఞాపకార్ధం నానకి అని పేరును పెట్టారు. తరువాతి కాలంలో ఈ చక్ నానకి గ్రామమే ఆనందపూర్ సాహిబ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
1932లో ఈ ప్రాంతం కొత్తగా రూపొందించబడిన పంజాబు స్టేట్ ఏజెన్సీలో భాగమైంది. 1936లో పంజాబు హిల్ స్టేట్స్ ఏజన్సీ పంజాబు స్టేట్స్ ఏజన్సీ నుండి వేరుచేసినపుడు అందులో భాగంగా ఉంది. 1948 అక్టోబరు 12న హెచ్.హెచ్ రాజా సర్ ఆనంద్ చంద్ స్వతంత్ర భారతదేశంతో విలీనం కావడానికి అంగీకారం తెలిపాడు. తరువాత ఈ ప్రాంతం చీఫ్ కమీషనర్ ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రత్యేక భూభాగంగా మారింది. 1954 జూలై 1 న బిలాస్పూర్ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాగా రూపొందింది. ఈ చారిత్రిక పట్టణం 1954లో సట్లైజ్ నదిమీద ఆనకట్ట నిర్మాణం చేసినపుడు ఏర్పడిన గోవింద సాగర్ జలాశయంలో మునిగిపోయింది. అపుడూ ఈ పాత పట్టణానికి ఎగువన సరికొత్తగా మరో పట్టణాన్ని నిర్మించారు.
బిలాస్‌పూర్‌లోని రాజపుత్రులు చందియా వంశానికి చెందినవారు. ఈ వంశానికి చెందిన పలు కుటుంబాలందరికీ కలిపి 1933లో 40,000 రూపాయల రాజభరణం అందేది. వీరిలో అజ్మీర్చండియా, కలియంచండియా, తరహండియా, సుల్తాన్ చండియా కొన్ని కుటుంబాలు.[2]
బిలాస్పూర్ జిల్లాను 3 తాలూకాలుగా విభజించారు. ఘుమర్విన్, బిలాస్పూర్ సరదార్, ఝందుత్త. ఘుమర్విన్ నుండి కొంతభూభాగం వేరుచేసి 1998 జనవరిలో ఝుందత్త రూపొందించబడింది. 1980 జనవరిలో బిలాస్పూర్ సరదార్ నుండి కొంత భూభాగం వేరుచేసి నైనాదేవి తహసీలును రూపొందించారు.
భౌగోళికంగా బిలాస్పూర్ దిగువ హిమాలయాలకు చెందిన (శివాలిక్ శ్రేణి) పర్వత ప్రాంతము. ఇది అన్నివైపుల పర్వతాలతో చుట్టబడివుండగా, దక్షిణ, పడమర వైపున పంజాబ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఇక్కడ వేసవిలో వేడిగాను, చలికాలంలో చల్లగాను వుంటుంది. వర్షాకాలం జూలై నుండి సెప్టెంబరు మద్య వరకు వుంటుంది. ఎండాకాల ప్రభావం మే నెల, జూన్ నెలలో అధికం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 382,056,[1] |
ఇది దాదాపు | మాల్దీవులు దేశ జనసంఖ్యకు సమానం [3] |
640 భారతదేశ జిల్లాలలో | 562వ స్థానంలో ఉంది[1] |
1చ.కి.మీ జనసాంద్రత | 327 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 12.08%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 981:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 85.67%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
బిలాస్పూర్ (హిమాచల్ ప్రదేశ్) జిల్లాలో రాజపుత్ర, గుజార్ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. జిల్లా ప్రజలు ప్రధానంగా భిలాస్పురి భాషను మాట్లాడుతుంటారు. హిందీ కూడా మాట్లాడుతారు.[4]
బిలాస్పూర్ జిల్లాలో సట్లజ్ నదిమీద నిర్మించిన భాక్రా ఆనకట్ట వలన ఏర్పడిన గోవింద్ సాగర్ జలాశయం వర్షాకాలంలో నీటితో నిండి పోతుంది. జలక్రీడలకు ఇది అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ రాజా కయాంగ్ మోటర్‌బోటింగ్, ఇతర విధానాల ద్వారా జలవిహారం చేయడం వంటి వినోదాలను ఆస్వాదించవచ్చు. సట్లజ్ నదిమీద కంద్రౌర్ వద్ద నిర్మించిన వంతెన ఆసియాలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన వంతెనగా గుర్తించబడింది. బండ్ల హిల్ కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
బిలాస్పూర్ జిల్లాలో రైల్వే స్టేషను కానీ, రైలు మార్గం కానీ, విమానాశ్రయం కానీ లేవు. రోడ్డు మార్గం మాత్రమే రవాణాకు, ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తుంది.
పశ్చిమ కహ్లురి కుటుంబానికి చెందిన భిలాస్పురి లేక కహ్లురి భాష మాట్లాడుతారు. హిందీ భాషను కూడా బాగా మాట్లాడుతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.