బిలాఫోండ్ లా
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
బిలాఫోండ్ లా (బాల్టీ భాషలో "సీతాకోకచిలుకల కనుమ" అని అర్థం) సాల్టోరో రిడ్జ్‌పై ఉన్న ఒక కనుమ మార్గం. దీన్ని దీనిని సాల్టోరో కనుమ అని కూడా అంటారు. ఇది విశాలమైన సియాచిన్ గ్లేసియర్‌కు పశ్చిమాన దాదాపు 40 కి.మీ. (25 మై.) దూరాన ఉంది. సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, భారతదేశాల మధ్య 1972 నాటి నియంత్రణ రేఖ ముగింపును బిందువు NJ 980420 కు సూటిగా ఉత్తరాన ఉంది. బిలాఫోండ్ లా భారత ఉపఖండాన్ని, చైనానూ కలిపే పురాతన సిల్క్ రూట్లో ఉంది.[3]
బిలాఫోండ్ లా | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,450 m (17,881 ft) |
ప్రదేశం | భారతదేశం, సియాచెన్ హిమానీనదం, కారకోరం శ్రేణి, గిల్గిట్-బల్టిస్తాన్, భారతదేశం[1][2] |
శ్రేణి | తూర్పు కారకోరం శ్రేణి |
Coordinates | 35°23′N 76°57′E |
భారత పాకిస్తాన్ల మధ్య సియాచిన్ వివాదంలో భాగంగా 1984 లో సైనిక చర్య ప్రారంభమైన సమయంలో బిలాఫోండ్ లా ఒక ప్రముఖమైన ప్రదేశం. భారత సైన్యం 1984 లో ఉత్తరాన సియా లా, 1987 లో దక్షిణాన గ్యోంగ్ లాతో పాటు ఈ కనుమను స్వాధీనం చేసుకుంది.[2] భారతదేశం ప్రస్తుతం బిలాఫోండ్ లా వద్ద పటిష్టమైన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది.[4]
బిలాఫోండ్ లా కనుమ, అలాగే సమీపంలోని సియా లా, గ్యోంగ్ లా కనుమలూ 1984లో సియాచిన్ వివాదంలో భాగమైన ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సైనిక కార్యకలాపాలు జరిగిన ప్రదేశాలు.[5] సియాచిన్ గ్లేసియర్‌కు పశ్చిమాన వ్యూహాత్మకమైన స్థానంలో ఉన్న ఈ కనుమ, భారత పాకిస్తాన్ల మధ్య ప్రస్తుత వాస్తవ క్షేత్ర స్థితి రేఖకు సమీపంలో ఉన్నందున, భారత సైన్యం ఇక్కడ సైనిక శిబిరాన్ని నిర్వహిస్తోంది.[6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.