Remove ads
ఒడిశా రాష్ట్రం బారిపడా జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
బారిపడా, ఒడిషా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న పట్టణం. బుధబలంగా నది తూర్పు ఒడ్డున ఉన్న బారిపడా ఉత్తర ఒడిషా ప్రాంతపు సాంస్కృతిక కేంద్రం. ఇటీవలి సంవత్సరాలలో, ఇక్కడ అనేక వృత్తిపరమైన కళాశాలలను ప్రారంభించడంతో ఇది విద్యా కేంద్రంగా ఉద్భవించింది.[3][4] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
బారిపడా | |
---|---|
పట్టణం | |
Coordinates: 21.94°N 86.72°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | మయూర్‌భంజ్ |
Government | |
• Body | Baripada Municipality |
Elevation | 36 మీ (118 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,16,874 |
• Rank | India 446th, Odisha 8th |
భాషలు | |
• అధికారిక | ఒరియా[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 757 0xx |
Telephone code | 06792-25xxxx/ 06792-26xxxx |
Vehicle registration | OD-11 |
ఈ పట్టణం మయూర్‌భంజ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. వైశాల్యం ప్రకారం ఒడిషాలో ఇది అతిపెద్ద జిల్లా. పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా, సెషన్స్ కోర్టులూ ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభ లోని బారిపడా విధాన సభ నియోజకవర్గ కేంద్రం ఇక్కడే ఉంది.[3][5]
బారిపడా 21.94°N 86.72°E వద్ద,[6] సముద్రమట్టం నుండి సగటున 36 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం బుధబలంగా నది ఒడ్డున ఉంది.
శీతోష్ణస్థితి డేటా - Baripada, Odisha (1981–2010, extremes 1955–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.7 (94.5) |
39.9 (103.8) |
42.4 (108.3) |
46.0 (114.8) |
48.3 (118.9) |
47.8 (118.0) |
40.6 (105.1) |
36.6 (97.9) |
39.6 (103.3) |
37.4 (99.3) |
36.1 (97.0) |
32.7 (90.9) |
48.3 (118.9) |
సగటు అధిక °C (°F) | 26.5 (79.7) |
30.1 (86.2) |
34.9 (94.8) |
37.8 (100.0) |
37.4 (99.3) |
34.9 (94.8) |
32.5 (90.5) |
32.0 (89.6) |
32.4 (90.3) |
31.7 (89.1) |
29.4 (84.9) |
26.8 (80.2) |
32.2 (90.0) |
సగటు అల్ప °C (°F) | 12.7 (54.9) |
16.2 (61.2) |
20.5 (68.9) |
24.1 (75.4) |
25.4 (77.7) |
25.9 (78.6) |
25.5 (77.9) |
25.4 (77.7) |
24.8 (76.6) |
22.1 (71.8) |
17.3 (63.1) |
12.6 (54.7) |
21.1 (70.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | 5.0 (41.0) |
6.8 (44.2) |
11.6 (52.9) |
15.2 (59.4) |
17.5 (63.5) |
18.9 (66.0) |
20.0 (68.0) |
20.4 (68.7) |
18.5 (65.3) |
14.6 (58.3) |
10.1 (50.2) |
5.0 (41.0) |
5.0 (41.0) |
సగటు వర్షపాతం mm (inches) | 14.2 (0.56) |
23.2 (0.91) |
39.2 (1.54) |
63.9 (2.52) |
126.7 (4.99) |
274.9 (10.82) |
322.7 (12.70) |
355.7 (14.00) |
282.8 (11.13) |
145.1 (5.71) |
21.3 (0.84) |
7.3 (0.29) |
1,677.1 (66.03) |
సగటు వర్షపాతపు రోజులు | 1.2 | 1.8 | 2.8 | 4.6 | 6.8 | 11.7 | 16.0 | 16.6 | 12.8 | 5.9 | 1.4 | 0.7 | 82.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 62 | 58 | 55 | 59 | 66 | 77 | 85 | 87 | 85 | 77 | 67 | 62 | 70 |
Source: India Meteorological Department[7][8] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బారిపడా జనాభా 1,10,058. అందులో 57,008 మంది పురుషులు, 53,050 మంది మహిళలు. పట్టణ సముదాయం జనాభా 1,16,874 లో 60,535 పురుషులు, 56,339 మంది స్త్రీలు.[9] మునిసిపాలిటీలో 1,000 మంది పురుషులకు 931 స్త్రీలు లింగ నిష్పత్తి ఉంది. జనాభాలో 9% మంది ఆరేళ్లలోపు వారు. వయోజనుల్లో అక్షరాస్యత 89.31%; పురుషుల అక్షరాస్యత 93.45%, స్త్రీల అక్షరాస్యత 84.88%.
బారిపడా నగరంలో మొత్తం అక్షరాస్యులు 89,421. వీరిలో 48,388 మంది పురుషులు కాగా, 41,033 మంది మహిళలు. బారిపడా నగరం సగటు అక్షరాస్యత 89.31 శాతం, ఇందులో పురుషుల అక్షరాస్యత 93.45% కాగా, స్త్రీల అక్షరాస్యత 84.88%.
బారిపడా రైల్వే స్టేషన్ ఒడిశాలోని తొలి స్టేషన్లలో ఒకటి. మయూర్‌భంజ్ పాలకుడు, మహారాజా కృష్ణ చంద్ర భంజ్‌దేవ్, బారిపడాను హౌరా-చెన్నై రైల్వే కారిడార్‌కు నారో-గేజ్ రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించాడు. దీనిని మయూర్‌భంజ్ స్టేట్ రైల్వే అనేవారు. ఒడిశాలో బ్రిటిష్ రాజ్ కాలంలో మొట్టమొదటి విమానాశ్రయాలను రాజాబాసా (నగరం నుండి 16 కి.మీ.), రాస్‌గోవింద్‌పూర్ (నగరం నుండి 60 కి.మీ.) లలో నిర్మించారు. వీటిని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారు.
ఇప్పుడు దాని స్థానంలో బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఏర్పడింది. ప్రస్తుతానికి, ఒక బారిపడా - రూప్సా - బాలాసోర్ ల మధ్య ఒకటి, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ నడుస్తాయి. బారిపడా నుండి పూరికి నేరుగా నడిచే వారపు రైలు కూడా ఉంది. బరిపాడ నుంచి కోల్‌కతాకు రైలు నడుస్తోంది. నగరం శివార్లలో భంజ్‌పూర్ రైల్వే స్టేషన్ పేరుతో మరొక రైల్వే స్టేషను ఉంది.
రోడ్డు రవాణాకు సంబంధించి, లగ్జరీ A/C బస్సులు నగరాల మధ్య ప్రసిద్ధ రవాణా సాధనాలు. ఇక్కడి నుండి భువనేశ్వర్, పూరి, సంబల్పూర్, ఝర్సుగూడ, రూర్కెలా, కియోంజర్, బాలాసోర్, అంగుల్, బోలంగీర్, భద్రక్, కటక్, జంషెడ్పూర్, ఖరగ్పూర్, రాంచీ, కోల్‌కతాలకు రోడ్డు సౌకర్యం ఉంది. నగరం, చెన్నై వెళ్ళే NH 5 (ప్రస్తుతం NH 18) ప్రారంభ స్థానం నుండి 3 కి.మీ దూరంలో ఉంది.
బారిపడా లోని [10] తాకత్‌పూర్‌లో నార్త్ ఒరిస్సా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ మహారాజా పూర్ణ చంద్ర జూనియర్ కళాశాల ఉంది. ఇక్కడ 2000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్ లలో ఉన్నత మాధ్యమిక విద్య అభ్యసిస్తారు. పట్టణాంలో MPC అటానమస్ కళాశాల ఉంది. ఇది వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యావేత్తలను అందిస్తుంది. పూర్వపు మయూర్‌భంజ్ ప్యాలెస్‌లో మహారాజా పూర్ణ చంద్ర జూనియర్ కళాశాల, సుమారు 500 మంది విద్యార్థినులతో ప్రభుత్వ మహిళా కళాశాల ఉన్నాయి.[11]
BPUTకి అనుబంధంగా, సీమంత ఇంజినీరింగ్ కాలేజ్ అనే ఇంజనీరింగ్ కళాశాల జార్పోఖారియా సమీపంలో ఉంది. ఇది బారిపడా నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. మయూర్‌భంజ్ న్యాయ కళాశాల (1978లో స్థాపించబడింది), B.Ed. కళాశాల, ఆయుర్వేద కళాశాల, హోమియోపతి కళాశాలలు బారిపడాలో ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.