భాద్రపద మాసము (సంస్కృతం: भाद्रपद bhaadrapad) తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. బాధ్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.[1]
బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు.
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1912 సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం బాధ్రపదమాసములో ప్రారంభమైనది.
పండుగలు
భాద్రపద శుద్ధ పాడ్యమి | * |
భాద్రపద శుద్ధ విదియ | * |
భాద్రపద శుద్ధ తదియ | వరాహ జయంతి |
భాద్రపద శుద్ధ చతుర్థి | వినాయక చవితి, శ్రీ పాద వలభ జననం |
భాద్రపద శుద్ధ పంచమి | ఋషి పంచమి |
భాద్రపద శుద్ధ షష్ఠి | సూర్య షష్ఠి |
భాద్రపద శుద్ధ సప్తమి | * |
భాద్రపద శుద్ధ అష్ఠమి | * |
భాద్రపద శుద్ధ నవమి | * |
భాద్రపద శుద్ధ దశమి | * |
భాద్రపద శుద్ధ ఏకాదశి | పరివర్తన ఏకాదశి |
భాద్రపద శుద్ధ ద్వాదశి | వామన జయంతి |
భాద్రపద శుద్ధ త్రయోదశి | * |
భాద్రపద శుద్ధ చతుర్దశి | అనంత పద్మనాభ వ్రతం |
భాద్రపద పూర్ణిమ | మహాలయ పౌర్ణమి |
భాద్రపద బహుళ పాడ్యమి | మహాలయ పక్షము ప్రారంభం |
భాద్రపద బహుళ విదియ | * |
భాద్రపద బహుళ తదియ | ఉండ్రాళ్ళ తద్దె |
భాద్రపద బహుళ చవితి | * |
భాద్రపద బహుళ పంచమి | * |
భాద్రపద బహుళ షష్ఠి | విశ్వనాథ సత్యనారాయణ జయంతి |
భాద్రపద బహుళ సప్తమి | * |
భాద్రపద బహుళ అష్ఠమి | * |
భాద్రపద బహుళ నవమి | * |
భాద్రపద బహుళ దశమి | * |
భాద్రపద బహుళ ఏకాదశి | ఇంద్రఏకాదశి |
భాద్రపద బహుళ ద్వాదశి | మహాత్మా గాంధీ జయంతి. |
భాద్రపద బహుళ త్రయోదశి | కలియుగము ప్రారంభమైన రోజు. |
భాద్రపద బహుళ చతుర్దశి | మాసశివరాత్రి |
భాద్రపద బహుళ అమావాస్య | మహాలయ అమావాస్య |
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.