From Wikipedia, the free encyclopedia
బాచు అచ్యుతరామయ్య (సెప్టెంబర్ 23, 1926 - జూన్, 2018) రంగస్థల నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.[1]
బాచు అచ్యుతరామయ్య | |
---|---|
జననం | సెప్టెంబర్ 23, 1926 గాజుల్లంక గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా |
మరణం | జూన్, 2018 గాజుల్లంక గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా |
ఇతర పేర్లు | బాచు అచ్యుతరామయ్య |
వృత్తి | రంగస్థల కళాకారులు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటుడు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు. |
అచ్యుతరామయ్య 1926లో సెప్టెంబర్ 23న గాజుల్లంకలో జన్మించారు. యువజన సంఘంలో చేరి ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు చల్లపల్లి నారాయణరావుతో కలిసి కమ్యూనిష్టు నడిపిన వివిధ ఉద్యమాలలో పాల్గొన్నారు. ప్రజనాట్య మండలి నిర్వహించిన ఫాసిష్టు వ్యతిరేక శిక్షణా శిబిరంలో శిక్షణ పాందారు. సుంకర సత్యనారాయణ వద్ద బుర్రకథ నేర్చుకున్నారు.
గాజుల్లంకలో వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటుచేశారు. గాజుల్లంకలో 36 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా, 40 సంవత్సరాలు బ్రాంచి పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ సమయంలో 40మంది కళాకారులను, క్రీడాకారులను, విద్యావేత్తలను సన్మానించారు.
1958 ప్రాంతంలో విరివిగా నాటకాలలో నటించారు.
మొదలైన నాటకాలలో నాయక పాత్రలు పోషించారు.
2018, జూన్ నెలలో మరణించారు.
Seamless Wikipedia browsing. On steroids.