బల్‌రాంపూర్ జిల్లా (ఛత్తీస్‌గఢ్)
ఛత్తీస్గఢ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలరాంపూర్ జిల్లా ఒకటి. జిల్లా కేంద్రం బలరాంపూర్ పట్టణం. బలరాంపూర్ జిల్లా ఛత్తీస్‌గఢ్ ఉత్తర సరిహద్దులో ఉంది. సుర్గుజా జిల్లాలోని కొంత భూభాగాన్ని వేరుచేసి, 2012 జనవరి 1 న ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. సుర్గూజా జిల్లాకు ఇది ఉత్తర, ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3806 చ.కి.మీ. జిల్లాను బలరాంపూర్, రాజ్‌పూర్, శంకర్‌గఢ్, కుష్మి, రామచంద్రపూర్, వద్రాఫ్‌నగర్ అనే 6 బ్లాకులుగా విభజించారు.[1]
బలరాంపూర్-రామానుజ్‌గంజ్ జిల్లా | |
---|---|
ఛత్తీస్‌గఢ్ జిల్లా | |
![]() Location of Balrampur-Ramanujganj district in Chhattisgarh | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఛత్తీస్గఢ్ |
డివిజను | జిల్లా |
ముఖ్య పట్టణం | బలరాంపూర్ |
తాలూకాలు | 6 |
విస్తీర్ణం | |
• Total | 3,806.08 కి.మీ2 (1,469.54 చ. మై) |
జనాభా | |
• Total | 7,30,491 |
• జనసాంద్రత | 190/కి.మీ2 (500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 54.24 |
Time zone | UTC+05:30 (IST) |
ప్రధాన రహదారులు | NH 343 |
రామానుజ్‌గంజ్ బలరాంపూర్ జిల్లా లోని చారిత్రిక ప్రదేశం. ఇది, జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన పట్టణం. ఈ పట్టణం ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ ల సరిహద్దులో ఉంది. రాంచి, రాయ్‌పూర్ లు దగ్గర లోని విమానాశ్రయాలు. బలరాంపూర్ జిల్లాకు తూర్పున జార్ఖండ్, ఉత్తరాన ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన మధ్య ప్రదేశ్ ఉన్నాయి. జిల్లా జనాభాలో 63% షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
పర్యాటకం
జిల్లా లోని ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలు:
- దిపాడీ (ప్రాచీన శిల్పాలు)
- రాకాస్‌గండ
- తాటాపానీ (వేడినీటి బుగ్గ)
విద్య
సర్గూజా విశ్వవిద్యాలయం, జిల్లా లోని ఏకైక విశ్వవిద్యాలయం. దీన్ని 2008 సెప్టెంబరు 2 న స్థాపించారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.