బజరంగ్ దళ్ అనే ది ఒక హిందూ ధార్మిక సంస్థ. విశ్వ హిందూ పరిషత్కు ఇది యువ విభాగం. దీన్ని 1984, అక్టోబర్ 1 న ఉత్తర ప్రదేశ్లో స్థాపించారు.[1][2][3][4] తరువాత ఇది దేశమంతటా విస్తరించింది. దీని నినాదం సేవ, సురక్ష, సంస్కృతి. గోవధను నిషేధించడం దీని ముఖ్యోద్దేశాలలో ఒకటి. అయోధ్యలో రామాలయం నిర్మించడం, మధురలో క్రష్ణ దేవాలయాన్ని నిర్మించడం, వారణాసిలో కాశీ విశ్వనాథునికి దేవాలయం నిర్మించడం వీరి లక్ష్యాలలో ముఖ్యమైనవి. ఈ మూడు ప్రదేశాలు ధర్మ పరంగా సున్నితమైనవి. ఇంకా హిందూ ధర్మం నుంచి ఇతర మతాలలోకి జరిగే మతమార్పులను అరికట్టడం కూడా వీరి ఉద్దేశాలలో ఒక భాగమే.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పుట్టుక
1984 లో విశ్వహిందూ పరిషత్ నేతలు కొంతమంది రామ్-జానకీ రథయాత్ర పేరుతో ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో తరచుగా ఊరేగింపులు నిర్వహించేవారు. దీని ద్వారా వారు సాధించదలచిన లక్ష్యం హిందూ జన జాగృతి. అయితే విశ్వ హిందు పరిషత్ నేతలు దీన్ని ఇతర మతాలకు వ్యతిరేకం కాదని ప్రకటించినప్పటికీ చాలా మంది దీన్ని హిందూ అతివాదంగా భావించడంతో ఆ ప్రదేశంలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం ప్రారంభించాయి. ఊరేగింపునకు అడ్డంకులు ఎదురు కాసాగాయి. దీంతో కలత చెందిన కొంతమంది విశ్వ హిందు పరిషత్ నేతలు హిందూ యువతను ఈ ఊరేగింపులకు రక్షణగా నిలబడమన్నారు. అలా ఏర్పడ్డదే, బజరంగ్ దళ్ సంస్థ.
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.