Remove ads
జపాన్ దేశంలో ఉన్న ఒక పర్వతం. ఇది శిథిలమైన అగ్నిపర్వతం From Wikipedia, the free encyclopedia
ఫ్యూజీ పర్వతం జపాన్ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రదేశం. ఇది హొన్షు ద్వీపంలో ఉంది. దీని శిఖరం 3776 మీటర్ల (12,389 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వతం. 1707-08 సంవత్సరాల మధ్యలో ఒకసారి బద్ధలైంది. ఇది జపాన్ రాజధాని నగరమైన టోక్యోకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణం నిర్మలంగా ఉన్న రోజున టోక్యో నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరంలో చాలా నెలలపాటు మంచుతో కప్పబడి ఉండే దీని చక్కని శంఖాకారపు ఆకృతి వల్ల జపాన్ దేశాన్ని సూచించడానికి ఈ పర్వతాన్ని అనేక కళాఖండాలలో వాడుతుంటారు. దీన్ని నిత్యం అనేక మంది యాత్రికులు, పర్వతారోహకులు సందర్శిస్తుంటారు.
ఫ్యూజీ పర్వతం | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 3,776.25 నుండి 3,778.23 మీ. (12,389.3 నుండి 12,395.8 అ.) |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 3,776 మీ. (12,388 అ.)[1] Ranked 35th |
జాబితా | Highest peak in Japan Ultra-prominent peaks List of mountains in Japan 100 Famous Japanese Mountains |
నిర్దేశాంకాలు | 35°21′29″N 138°43′52″E[2] |
Naming | |
ఉచ్చారణ | [ɸɯꜜdʑisaɴ] |
భౌగోళికం | |
Topo map | Geospatial Information Authority 25000:1 富士山[3] 50000:1 富士山 |
Geology | |
Age of rock | 100,000 years |
Mountain type | Stratovolcano |
చివరిగా విస్ఫోటనం చెందినది | 1707-1708 |
అధిరోహణం | |
మొదటి అధిరోహణ | 663 by En no Odzunu(役行者, En no gyoja, En no Odzuno) |
సులువుగా ఎక్కే మార్గం | Hiking |
UNESCO World Heritage Site | |
Official name | Fujisan, sacred place and source of artistic inspiration |
Criteria | Cultural: iii, vi |
సూచనలు | 1418 |
శాసనం | 2013 (37th సెషన్ ) |
ప్రాంతం | 20,702.1 ha |
Buffer zone | 49,627.7 ha |
ఈ పర్వతం జపాన్ యొక్క మూడు పవిత్ర పర్వతాల్లో ఒకటి. మిగతా రెండు పర్వతాలు టేట్ పర్వతం, హకు పర్వతం. ప్రకృతి అందాల్లో ప్రత్యేకత కలిగిన ఈ పర్వతం జపాన్ దేశపు ప్రాచీన స్థలాల్లో ఒకటి.[4] జూన్ 22, 2013 న యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించారు.[4] యునెస్కో వారు ఈ ఫ్యూజీ పర్వతం కొన్ని శతాబ్దాలుగా కళాకారులకు, కవులకు స్ఫూర్తి కలిగిస్తూందనీ, అనేక మంది యాత్రికులను ఆకట్టుకుంటోందని ప్రశంసించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.