ప్రేమనగర్

From Wikipedia, the free encyclopedia

ప్రేమనగర్

ప్రేమ్ నగర్ లేదా ప్రేమనగర్, 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మూసివేయి

కథా సంగ్రహం

కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.

పాత్రలు-పాత్రధారులు

సాంకేతిక వర్గం

దర్శకుడు: కోవెలమూడి సూర్యప్రకాశరావు

కధ: కోడూరి కౌసల్యాదేవి

మాటలు: ఆచార్య ఆత్రేయ

పాటలు: ఆచార్య ఆత్రేయ , దువ్వూరు రామిరెడ్డి

సంగీతం: కె.వి.మహదేవన్

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్.ఆర్ ఈశ్వరి

నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు

నిర్మాణ సంస్థ: సురేష్ మూవీస్

విడుదల:24:09:1971.

పాటలు

ఈ సినిమాలో పాటలు తెలుగు చలన చిత్రరంగంలో ఆల్-టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరుతాయి.

మరింత సమాచారం పాట, రచయిత ...
పాట రచయిత సంగీతం గాయకులు
ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీదేశం పోరా ఆచార్య ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
ఎవరో రావాలీ, ఈ వీణను కదిలించాలలీ ఆచార్య ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండె గుల్లా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
నీకోసం వెలిసిందీ ప్రేమమందిరం - నీకోసం విరిసిందీ హృదయనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
మనసు గతి యింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల ఎల్.ఆర్.ఈశ్వరి
మూసివేయి

పద్యాలు

ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన పద్యాలు కూడా ఉన్నాయి:

  1. అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల... (దువ్వూరి రామిరెడ్డి 'పానశాల'లోనిది) (గానం: ఘంటసాల)
  2. కలడందురు దీనులయెడ... (పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)

వెలుపలి లింకులు

வசந்த மாளிகை

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ప్రేమనగర్-మూలకథ ఆధారం: (కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్య ఆత్రేయ
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.