భారతీయ శస్త్రవైద్యుడు From Wikipedia, the free encyclopedia
ప్రమోద్ కరణ్ సేథీ (నవంబర్ 28, 1927 - జనవరి 7, 2007) కృత్రిమ పాదం (జైపూర్ ఫూట్) సృష్టికర్త. సేథీ భారతదేశం, బ్రిటన్ దేశాలలో తన వైద్య డిగ్రీని పూర్తి చేశాడు, తరువాత జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో శస్త్రచికిత్సలో ప్రొఫెసర్ గా ఉన్నాడు. జైపూర్ పాదం ఐదు సంవత్సరాల విస్తృత పరిశోధన తరువాత రూపొందించబడింది. దీనిని ధరించిన వ్యక్తి పరిగెత్తడానికి, ఎక్కడానికి, మడవ( పెడల్) చేయవచ్చును. ఈ కృత్తిమ పాదం, సుమారు ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది, దీనికి అయ్యే ఖర్చు సుమారు $ 30, 25 దేశాలలో లభిస్తుంది.[1]
ప్రమోద్ కుమార్ సేథీ | |
---|---|
జననం | వారణాశి, భారత దేశం | 1927 నవంబరు 28
మరణం | 2008 జనవరి 6 80) | (వయసు
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | పి.కె.సేథీ |
వృత్తి | ఆర్థోపెడిక్ సర్జన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | జైపూర్ కాలు |
1927, నవంబర్ 28 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008, జనవరి 7న జైపూర్లో మరణించారు.
జైపూర్ ఫుట్ ఆలోచన : ఎముకల వైద్య నిపుణుడైన సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే మెరుపు ఆలోచన వచ్చింది రామచంద్రారావుకే. ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే భావన ప్రచారంలో ఉంది.
జైపూర్ ఫుట్ అభివృద్ధి : జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. కాబట్టి సేథీ రబ్బరు, చెక్క, అల్యూమినియంతో దీని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. అయిననూ 1975 వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నవారు కొద్దిమందే. అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత జైపూర్ ఫుట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుట్లను అమర్చింది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా జైపూర్ ఫుట్ లనే అమర్చుకున్నారు. ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్నే అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.
అవార్డులు : ప్రమోద్ కరణ్ సేథీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారంతో సత్కరించగా, అత్యధికులకు కృత్రిమ అవయవం అమర్చినందులకు సేథీ పేరునే గిన్నిస్ బుక్ వారు రికార్డు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా సేథీని వెదుక్కుంటూ వచ్చింది.[2]
సేథీ ప్రారంభ దశలో అనేక మంది వికలాంగులను చూశాడు, ముఖ్యంగా యువకులు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు, ఎత్తు నుండి పడిపోవడం లేదా అంటువ్యాధుల ఫలితంగా కాళ్ళు కోల్పోవడం చూడటం జరిగింది . పాశ్చాత్య దేశాలలో వృద్ధ జనాభాలో పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధుల కారణంగా ఎక్కువ విచ్ఛేదనం జరిగింది. ఆ రోజుల్లో భారతదేశంలో ఎక్కువ (కృత్తిమ కాళ్ళు) లింబ్ ఫిట్టింగ్ సెంటర్లు లేవు, జైపూర్ నుండి వికలాంగులు తమ అవయవాన్ని అమర్చుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
పాలిమర్స్ తో తయారు చేసిన పాశ్చాత్య డిజైన్ అవయవాలు వాటిని నేలపై కూర్చోనివ్వవు, చెప్పులు లేకుండా నడవలేరు, పొలాలు, , నీటిలో పనిచేయవు, అవి సులభంగా విరిగిపోతాయి. భారతదేశం వంటి ఉష్ణ దేశానకి క్రింద కూచునే విధానం ("ఫ్లోర్ సిట్టింగ్" ) జీవనశైలి, పాశ్చాత్య దేశాలలో కుర్చీల పై కూర్చుంటారు, మన దేశ సంస్కృతికి భిన్నంగా ఉందని, అందువల్ల పాశ్చాత్య దేశాలలో లభించే పరిష్కారాలు భారతీయ వికలాంగుల సమస్యలకు సరిపోవని హేతుబద్ధీకరించారు. అందువలన సేథీ భారతీయ వికలాంగులకు తగిన ప్రోస్టెసిస్ రూపకల్పనకు పూనుకున్నాడు. 1950వ దశకం నుంచి పోలియో బాధితులకు తగిన కాలిపర్లు అందించేందుకు కృషి చేశాడు. భారతదేశంలో వైకల్యాలు, నడవటానికి పోలియో కారణలు. పాశ్చాత్య కృత్రిమ అవయవాల మాదిరిగానే, పోలియో కోసం కాలిపర్లు భారతీయ రోగులకు తగినవి కావని, చాలా బరువుగా, అసౌకర్యంగా, ఖరీదైనవి గా ఉంటాయని, భారతదేశ ప్రజలకు సరికావని, ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీతో కలిసి పాలియురేథేన్ తో తేలికపాటి, చౌకైన కాలిపర్లను అభివృద్ధి చేశారు.
సేథీ సృష్టించిన పాదం మొదటి సాంకేతిక ప్రదర్శన చేసినప్పుడు, దానిని సేథి పాదం అని పిలవమని ఎంతో మంది అతనికి సలహాలు ఇచ్చారు, అయితే దానికి నిరాకరించి. తన పేరుకు బదులుగా అతడి కర్మ భూమి (పని ప్రదేశం) అయిన నగరం పేరు మీద" జైపూర్ పాదం" అని పేరు పెట్టాడు. సేథీ తన ఆవిష్కరణకు హక్కులు ( పేటెంట్ ) పొందలేదు, ఈ పాదం తయారుచేయడం చాలా సులభమని, దీనిని స్థానిక కళాకారుడితో ఏ గ్రామంలోనైనా తయారు చేయవచ్చని, ప్రతి ఒక్కరు ఉత్పత్తి చేయనివ్వండి అతని అభిప్రాయం. భారతదేశంలో వికలాంగుల సంఖ్యకు అసాధారణ పరిష్కారాలు అవసరం. ఈ వినూత్న విధానం కారణంగా జైపూర్ పాదం అభివృద్ధి చెంది, ఇతర దేశాలలో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికాలోని అనేక దేశాలలో మిలియన్ల మంది వికలాంగులకు అమర్చబడింది. జైపూర్ అవయవ నమూనా లండన్ లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ల్యాండ్ మైన్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు.[3]
భారతదేశంలోని కొత్త తరం వైద్యులు పాశ్చాత్య ఆలోచనలకు ఆకర్షితులవుతున్నారని, వాటిని భారతదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాని, భారతదేశంలో రోగుల సమస్యలు వారి పాశ్చాత్యులతో పోలిస్తే , చాలా భిన్నంగా ఉన్నాయని, అన్ని భావనలకు సరిపోయే ఒక పరిమాణం పని చేయదని అతని నమ్మకం. ఔషధాల వ్యాపారీకరణ, మందులు, పరిశోధనల మితిమీరిన వాడకం, ఔషధముల ఉత్పత్తి (ఫార్మా కంపెనీల) ప్రభావంపై ఆయన అంగీకరించలేదు. నేటి వైద్యులు సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎంత వ్యామోహంతో ఉన్నారంటే రోగుల మాటలు వినడం మానేశారని, కోలుకోవడంలో రోగులకు సహాయ పడే విధానం (కమ్యూనికేషన్ స్కిల్స్) మరిచిపోయారని , తన ఆదర్శవాదాన్ని యువ తరం భారతీయ వైద్యులకు అందించలేనందుకు భాద పడినాడు.[3]
కాళ్ళు కోల్పోయిన ఎందరికో కృత్రిమ కాళ్ళు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన సేథీ 2007, జనవరి 7 న జైపూర్లో మరణించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.