From Wikipedia, the free encyclopedia
ప్రతాప్ సింహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరులో లోక్‌సభలో జరిగిన పొగబాంబు ఘటనలో దుండగులు ఆయన కార్యాలయం ఇచ్చిన పాసులతోనే లోక్‌సభలోకి ప్రవేశించిన నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు.[1][2]
ప్రతాప్ సింహ | |||
![]() | |||
లోక్‌సభ సభ్యుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 మే 2014 | |||
ముందు | అడగూర్ హెచ్.విశ్వనాథ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మైసూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | సకలేష్పుర , కర్ణాటక , భారతదేశం | 21 జూన్ 1976||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అర్పిత | ||
సంతానం | 1 |
ప్రతాప్ సింహ కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిల్లా, సకలేష్ పురా గ్రామంలో బీ.ఈ. గోపాల్ గౌడ్, పుష్ప దంపతులకు 1976 జూన్ 21న జన్మించాడు. ఆయన మైసూరు యూనివర్శిటీ నుండి మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తి చేశాడు.
ప్రతాప్ సింహ 2010లో అర్పితను వివాహమాడాడు. వారికీ ఓ పాప విపంచి ఉంది.
ప్రతాప్ సింహ 2014లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మైసూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అడగూర్ హెచ్.విశ్వనాథ్ పై 31608 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.హెచ్. విజయ్ శంకర్ పై 138647 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.