పౌర్ణమి (ధారావాహిక)
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
పౌర్ణమి 2018, నవంబరు 12న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక.[1][2] సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారంచేయబడుంది.[3] ఈ ధారావాహికలో రష్మీ ప్రభాకర్,[4] కిరణ్ కాంత్, ఎక్ నాథ్,[5] సంయుక్త, రాజ్ కుమార్,[6] భావన[7] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
పౌర్ణమి | |
---|---|
![]() పౌర్ణమి ధారావాహిక పోస్టర్ | |
జానర్ | కుటుంబ కథ |
రచయిత | మహేందర్ దొంగరి (వర్మ), మాటలు నరసింహ మూర్తి నల్లం |
ఛాయాగ్రహణం | మహేందర్ దొంగరి (వర్మ) |
దర్శకత్వం | జె.ఎస్. రాజు |
క్రియేటివ్ డైరక్టరు | కె.వి. కిరణ్ కుమార్ |
తారాగణం | రష్మీ ప్రభాకర్ కిరణ్ కాంత్ ఎక్ నాథ్ సంయుక్త రాజ్ కుమార్ భావన |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 309 (28 డిసెంబరు 2019) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | వైదేహి రామ్మూర్తి |
ఛాయాగ్రహణం | శరవరణ్ |
ఎడిటర్లు | పసుపులేటి గుణశేఖర్ సుబ్రహ్మణ్యం పోలిసెట్టి |
కెమేరా సెట్అప్ | మల్టిఫుల్ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | విజన్ టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి. |
వాస్తవ విడుదల | 12 నవంబరు 2018 - ప్రస్తుతం |
కాలక్రమం | |
Preceded by | మాయ్ |
బాహ్య లంకెలు | |
Website |
ఈ సీరియల్ కథ మొత్తం పౌర్ణమి, ఆమె తండ్రి చుట్టూ తిరుగుతుంది. పౌర్ణమి చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి ఒంటరివాడవుతాడు. చిన్నప్పటినుండి పౌర్ణమి అంటే ఇష్టంలేని ఆమె తండ్రి తన భార్య మరణానికి పౌర్ణమిని నిందిస్తుంటాడు. తన తండ్రి తనని ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్న పౌర్ణమికి తన ఆశ నిరాశ అవుతుంది. ఇదే సందర్భంలో ఒకరోజు పౌర్ణమి తండ్రి, పౌర్ణమిని ఇంటినుండి పంపించివేస్తాడు. పౌర్ణమి తన తండ్రి మనసును ఎలా గెలుచుకుందన్నది మిగతా కథ.
Seamless Wikipedia browsing. On steroids.