Remove ads
From Wikipedia, the free encyclopedia
పౌడీ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడీ గర్వాల్ జిల్లాలో ఉన్న పట్టణం. పౌడీ గర్హ్వాల్ డివిజన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.
పౌడీ | |
---|---|
పట్టణం | |
Nickname: గఢ్వాల్ | |
Coordinates: 30.15°N 78.78°E | |
దేశం | India |
రాష్ట్రం | Uttarakhand |
జిల్లా | పౌడీ గఢ్వాల్ |
Elevation | 1,765 మీ (5,791 అ.) |
జనాభా (2011) | |
• Total | 25,440 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN Code | 246001 |
Telephone code | +91-1368 |
పౌడీ 30.15°N 78.78°E వద్ద [1] సముద్ర మట్టానికి 1,765 మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడి నుండి నందా దేవి, త్రిశూల్, గంగోత్రి గ్రూప్, తలయ్యా-సాగర్, నిఖంతా, బ్యాండర్ పూంచ్, స్వర్గారోహిణి, కేదార్నాథ్, కర్చా కుండ్, సాతోపంథ్, చౌకంభా, ఘోరీపర్వత్, హాతి పర్వత్, సుమేరు, మొదలైన మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి. కండోలియా-టెక్కా మీదుగా సతత హరిత దేవదారు వృక్షాల వెంట నడక ఆహ్లాదం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. ట్రెక్కర్లు, పారాగ్లైడింగ్ ప్రియులు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గధామం
ఈ ప్రాంతంలో ఉప-ఉష్ణోగ్రత నుండి సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. పౌడీ శీతోష్ణస్థితి చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రాంతంలో తక్కువ నుండి మితమైన హిమపాతం సంభవిస్తుంది. వర్షాకాలంలో శీతోష్ణస్థితి చాలా చల్లగా ఉంటూ పట్టణాన్ని పచ్చదనంతో కప్పేస్తుంది.
2011 జనగణన ప్రకారం [2] పౌడీ నగర్ పాలికా పరిషత్తు జనాభా 25,440, అందులో 13,090 మంది పురుషులు, 12,350 మంది స్త్రీలు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2766. ఇది పౌడీ మొత్తం జనాభాలో 10.87%. రాష్ట్రంలో లింగనిష్పత్తి 963 ఉండగా, పౌడీలో 943గా ఉంది. పిల్లల్లో లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 890 కాగా పౌడీలో 877. ఇక్కడి అక్షరాస్యత 92.18%. రాష్ట్ర సగటు 78.82%. పౌడీలో పురుషుల అక్షరాస్యత 95.74% కాగా స్త్రీల అక్షరాస్యత 88.44%. పౌడీలో 6,127 గృహాలున్నాయి.
2001 జనగణన నాటికి [3] పౌడీ జనాభా 24,742. ఇందులో పురుషులు 53% స్త్రీలు 47%. జనాభాలో 12% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. పౌడీ గర్వాల్‌లో సాధారణంగా ఉపయోగించే భాష గఢ్వాలీ.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.