Remove ads
మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ తూర్పు జిల్లా ముఖ్య నగరం. From Wikipedia, the free encyclopedia
పోరోంపాట్, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ తూర్పు జిల్లా ముఖ్య నగరం.[1]
పోరోంపాట్ | |
---|---|
నగరం | |
Coordinates: 24.812546°N 93.959621°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | ఇంఫాల్ తూర్పు |
జనాభా (2011) | |
• Total | 6,191 |
భాషలు | |
• భాషలు | మీటీ (మణిపూర్) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
ఈ నగరం 24.812546°N 93.959621°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, పోరోంపాట్ నగరంలో 5,163 జనాభా ఉంది. ఈ జనాభాలో 49% మంది పురుషులు, 51% మంది స్త్రీలు ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 61% గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
2011లో 6,191 జనాభా ఉంది. ఇందులో 2,975 మంది పురుషులు, 3,216 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 767 (12.39%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. నగర అక్షరాస్యత రేటు 88.81% కాగా, రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.07% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 83.07% గా ఉంది.[2]
ఈ నగరంలో హిందువులు 67.40% మంది, ముస్లింలు 19.74% మంది, క్రైస్తవులు 0.52% మంది, జైనులు 0.02% మంది, ఇతరులు 12.32% మంది ఉన్నారు.
పోరోంపాట్ నగరంలో 1,232 గృహాలు ఉన్నాయి. నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. నగరంలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.