From Wikipedia, the free encyclopedia
పేర్వారం రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తొలి చైర్మన్‌గా పని చేశాడు.[1]
పేర్వారం రాములు | |||
పదవీ కాలం 2015 - 2017 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | 1944 ఖిలాషాపూర్, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | పేర్వారం సంతాజీ, వీరమ్మ | ||
జీవిత భాగస్వామి | ఇందిరా | ||
సంతానం | రేవతి | ||
నివాసం | పంజాగుట్ట హైదరాబాదు, భారతదేశం | ||
మతం | హిందూ |
పేర్వారం రాములు 1944లోతెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, ఖిలాషాపూర్ గ్రామంలో పేర్వారం సంతాజీ, వీరమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఆయన కాకతీయ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు.
పేర్వారం రాములు 1967లో ఐ.పి.ఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యి నర్సరావుపేట ఎఎస్పీగా, ఖమ్మం, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, 1980 నుండి 1983 వరకు ఈస్ట్ & వెస్ట్ జోన్స్ హైదరాబాద్ నగర డి.సి.పి గా, 1983 నుండి 1987 వరకు ఏలూరు రేంజ్ డి.ఐ.జి గా, 1987 నుండి 1990 వరకు హైదరాబాద్ రేంజ్ డి.ఐ.జి గా, ఉద్యొగంలో ప్రమోషన్ లో భాగంగా ఐ.జి.పి గా 1991 నుండి 92 వరకు, రవాణా శాఖ కమీషనర్‌గా, ఎక్స్ - ఆఫీషియో సెక్రటరీ (ఆర్&బి) & ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఐ.జి.పి (కంట్రోలర్) (లీగల్ మెట్రోలాజి) గా పని చేసి తరువాత అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా, 01 నవంబర్ 97 నుండి 15 డిసెంబర్ 2000 వరకు అవినీతి నిర్ములనా శాఖ డైరెక్టర్ జనరల్ గా, పని చేసిన తరువాత చేసి హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్‌గా, 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితుడై, జులై 2003లో ఉద్యోగ విరమణ చేశాడు.[3] ఆయన తరువాత సెప్టెంబర్ 2003 నుండి జులై 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా పని చేశాడు.[4]
పేర్వారం రాములు 24 మార్చి 2009న తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో 2012లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 18 మార్చి 2015లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.