From Wikipedia, the free encyclopedia
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 - ప్రస్తుతం | |||
ముందు | జి.శంకర్ యాదవ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | తంబళ్ళపల్లె నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1 జూన్ 1967 ఎర్రతివారిపల్లె, సదుం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | పెద్దిరెడ్డి లక్ష్మణ రెడ్డి | ||
జీవిత భాగస్వామి | పెద్దిరెడ్డి కవిత | ||
బంధువులు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (అన్న) | ||
సంతానం | 1 |
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి 1 జూన్ 1967లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, సదుం మండలం , ఎర్రతివారిపల్లె గ్రామంలో జన్మించాడు. ఆయన 9వ తరగతి వరకు చదువుకున్నాడు.[2]
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదుం సింగిల్విండో చైర్మన్గా, చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ చైర్మన్గా పని చేశాడు. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్ళపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా 2016లో నియమితుడయ్యాడు.[3]
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.