From Wikipedia, the free encyclopedia
పూడిపెద్ది వెంకటరమణయ్య తొలితరం కథారచయిత. ఇతడు 1893లో విశాఖపట్నంలో బుచ్చయ్య, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే జరిగింది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.[1] ఇతడు ఎక్కువ కాలం శ్రీకాకళం జిల్లా రాజాంలో నివసించి 1937లో అక్కడే మరణించాడు. ఇతడు విశాఖపట్నంలోని కవితా సమితిలో ముఖ్యమైన సభ్యుడు. ఇతడు సుమారు 300 కథలను రచించాడు. కేవలం కథలను ప్రచురించడానికి ఇతడు పూలగుత్తి అనే పత్రికను నడిపాడు.[2] ఇతని కథలు, పద్యాలు, గేయాలు, వ్యాసాలు పూలగుత్తితో పాటు భారతి, ఆంధ్రపత్రిక, ప్రబుద్ధాంధ్ర, ఆనందవాణి, వినోదిని, గృహలక్ష్మి, విజయ, పుస్తకం, జయలక్ష్మి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
పూడిపెద్ది వెంకటరమణయ్య | |
---|---|
జననం | 1893 |
మరణం | 1937 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత |
గుర్తించదగిన సేవలు | పూలమాల, పూడిపెద్ది వారి కథలు |
తల్లిదండ్రులు | బుచ్చయ్య, సూరమ్మ |
కథానిలయంలో లభ్యమౌతున్న పూడిపెద్ది వెంకటరమణయ్య కథల జాబితా[3]:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.