తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
పుల్కల్ మండలం, తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1] పుల్కల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజనులో భాగం.[3] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
పుల్కల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.749995°N 77.983475°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | పుల్కల్ (సంగారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,386 |
- పురుషులు | 25,737 |
- స్త్రీలు | 25,649 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.42% |
- పురుషులు | 58.10% |
- స్త్రీలు | 30.16% |
పిన్కోడ్ | 502293 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 51,386 - పురుషులు 25,737 - స్త్రీలు 25,649. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 249 చ.కి.మీ. కాగా, జనాభా 51,386. జనాభాలో పురుషులు 25,737 కాగా, స్త్రీల సంఖ్య 25,649. మండలంలో 11,364 గృహాలున్నాయి.[4]
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.