పురుషార్థాలు

From Wikipedia, the free encyclopedia

Remove ads
Remove ads

చతుర్విధ పురుషార్థాలు: ధర్మార్థకామమోక్షాలు (ధర్మం, అర్థం, కామం, మోక్షం).

పురుషార్ధాలు అంటే వ్యక్తికి 'కావలసినవి'. హిందూమతం సంప్రదాయంలో అందరికీ అవసరమైన నాలుగు విషయాలు తరచు ప్రస్తావింప బడుతాయి. అవి

  • "ధర్మము" : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము. నీతి, విద్య అనికూడా అన్వయించవచ్చును.
  • "అర్థము" : ధన సంపాదన, కీర్తి.
  • "కామము" : శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు.
  • "మోక్షము" : పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల.

ఆశ్రమ ధర్మాలు అనికూడా వీటిని చెబుతుంటారు. మొదటి మూడూ "గృహస్తాశ్రమ ధర్మాలు" అనగా గృహస్తులు పాటించవలసిన ధర్మాలు. వ్యక్తి ధర్మానికి బద్ధుడై ధనాన్ని సంపాదించాలనీ, తద్వారా సుఖాలు అనుభవించాలనీ అంటారు. కనుకనే ధర్మేన, అర్ధేన, కామేన నాతిచరామి అని పెళ్ళిలో ప్రమాణం చేయంచబడుతుంది.

తరువాత "వానప్రస్థాశ్రమం"లో భార్యా భర్తలు కలసి వుంటూనే లౌకిక భోగాలకు దూరంగా ఉండి మోక్షార్ధులై జప తపాదులు నిర్వహించవచ్చును. అయితే సన్యాసం తీసుకొన్నవారు సంసారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మోక్షమును పొందాలంటే కామము అనగా కోరిక, ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రము కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగము చెయ్యడము. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతము ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాసస్థితిని పొందుతారు.


Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads