పుట్టిల్లు

1953 తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia

పుట్టిల్లు

ఈ చిత్రం ద్వారా జమున తొలిసారిగా వెండితెరకు పరిచయమయ్యింది'.పుట్టిల్లు ' తెలుగు చలన చిత్రం 1953 ఫిబ్రవరి ,19 న విడుదల. రాజా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత దర్శకుడు డాక్టర్ గరికపాటి రాజారావు తెరకెక్కించిన ఈ చిత్రం లో గరికపాటి రాజారావు తో పాటు జూలూరి జమున నటించింది. ఇంకా ఈ చిత్రం లో మిక్కిలినేని, సురభి కమలాబాయి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
పుట్టిల్లు
(1953 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం గరికపాటి రాజారావు
తారాగణం గరికపాటి రాజారావు,
జమున,
అల్లు రామలింగయ్య,
మిక్కిలినేని
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ రాజ ప్రొడక్షన్స్
నిడివి 176 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

తారాగణం

గరికపాటి రాజారావు

జూలూరి జమున

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

తిక్కవరపు రమణారెడ్డి

అల్లు రామలింగయ్య

సురభి కమలాబాయి

సాంకేతిక వర్గం

నిర్మాత, దర్శకుడు: గరికపాటి రాజారావు

సంగీతం: మోహన్ దాస్- తాతినేని చలపతిరావు

నిర్మాణ సంస్థ: రాజా ప్రొడక్షన్స్

గాయనీ గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, కె.రాణి, ఎ.పి.కోమల, నాజర్, టి.జి.కమలాదేవి, మాధవపెద్ది సత్యం

విడుదల:19:02:1953.

పాటలు

  • ఏలనోయి సరసుడా జాగాలేనోయి సరసుడా పలుమారు వేడితిని - జిక్కి
  • ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ -కె. రాణి, పిఠాపురం
  • ఎందుకురా మీకెందుకురా ఆలీ మొగడు నడాన జగడం -
  • కనుమోయీ ఓ నెలరాజా కలువల రాణిని కనుమోయీ -
  • చదివిస్తాడు అన్నయ్య చదివిస్తాడు మా అన్నయ్య -
  • జో జో లాలి లాలి జోజో కుమారా సుందరాకార నాకు వెలుగును - ఎ.పి.కోమల
  • తాతయ్య తాతయ్య నీకు నాకు తాతయ్య మన తెలుగుజాతికే -
  • మనది భారతదేశమమ్మా మనది భారత జాతి తల్లి -
  • వినరా భారత వీర కుమారా విజయము మనదేరా (బుర్రకధ) - నాజర్ బృందం

వనరులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.