From Wikipedia, the free encyclopedia
పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.[1]
పి.సుదర్శన్ రెడ్డి | |||
![]() | |||
మాజీ మంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | 1949 శీరాంపల్లె గ్రామం, నవీపేట్ మండలం , నిజామాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | గంగారెడ్డి , రుక్మవ్వ | ||
జీవిత భాగస్వామి | సుచరిత | ||
సంతానం | రాధిక, రచన, రజిత్‌రెడ్డి | ||
నివాసం | హైదరాబాద్ |
పి.సుదర్శన్ రెడ్డి 1949లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, నవీపేట్ మండలం, శీరాంపల్లె గ్రామం లో గంగారెడ్డి, రుక్మవ్వ దంపతులకు జన్మించాడు.[2] ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో బిఎ మధ్యలోనే ఆపేశాడు.[3]
పి.సుదర్శన్ రెడ్డి మద్యం వ్యాపారంలో కొనసాగుతూ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి కె రమాకాంత్ పై 9289 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.
పి.సుదర్శన్ రెడ్డి 2004, 2009లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్‌లో రికార్డు నెలకొల్పాడు.[4] ఆయన 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశాడు.[5][6] ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 & 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.[7]
ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు, ఆ తరువాత ఆయనను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 2024 మార్చి 31న నిజామాబాద్ లోక్‌సభ ఇన్చార్జ్గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[8]
Seamless Wikipedia browsing. On steroids.