తెలంగాణ శాసనమండలి సభ్యులు From Wikipedia, the free encyclopedia
పరుపాటి వెంకట్రామి రెడ్డి భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారి. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న ఆయన 15 నవంబర్ 2021న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[1] ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు.[2] ఆయన ఈ పదవిలో 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతాడు.[3]
పరుపాటి వెంకట్రామి రెడ్డి | |||
ఎమ్మెల్సీ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 22 నవంబర్ 2021 - 21 నవంబర్ 2027 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 21 సెప్టెంబర్ 1962 ఇందుర్తి, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
నివాసం | హైదరాబాద్ | ||
పూర్వ విద్యార్థి | డిగ్రీ | ||
మతం | హిందూ మతము |
వెంకట్రామి రెడ్డి 21 సెప్టెంబర్ 1962లో తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, ఇందుర్తి గ్రామంలో పరుపాటి రాజిరెడ్డి, పుష్పలీల దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ పూర్తి చేశాడు.[4]
పి.వెంకట్రామి రెడ్డి 1996లో గ్రూప్-1 ఉద్యోగం సంపాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశాడు. ఆయన 2002 నుండి 2004 వరకు మెదక్ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పని చేశాడు. వెంకట్రామి రెడ్డి హుడా సెక్రటరీగా, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్గా పని చేసి 2007లో ఐఏఎస్ హోదా పొందాడు. ఆయన 24, మార్చి 2015 నుంచి 10, అక్టోబర్ 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత 11 అక్టోబర్, 2016న సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు.
పి.వెంకట్రామి రెడ్డి 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్గా విధులు నిర్వహించి,[5] ఎన్నికల అంతరం తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి [6] నవంబర్ 15, 2021న ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.[7][8]
వెంకట్రామి రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఉద్యోగానికి రాజీనామా చేసి 2021 నవంబర్ 16న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై,[9][10][11] నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.