Remove ads
పత్రికా సంపాదకుడు From Wikipedia, the free encyclopedia
1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1982లో ఈ పత్రికను పిరాట్ల వెంకటేశ్వర్లు పునరుద్ధరించాడు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి తనవంతు కృషి చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ తరఫున పోరాడాడు. ఆనంతరం పత్రికా రంగంలో స్థిరపడ్డాడు. తన జీవితకాలంలో వివిధ సమస్యలపై ఎన్నో పుస్తకాలు రచించాడు. [1],.[2] నక్సలైట్లతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావాలన్న తపనతో అటు ప్రభుత్వానికి, ఇటు నక్సలైట్లకు మధ్య వారధిగా వ్యవహరించిన వారిలో ఇతడు ముఖ్యుడు.
పిరాట్ల వెంకటేశ్వర్లు | |
---|---|
జననం | పిరాట్ల వెంకటేశ్వర్లు 1940 జూలై 16 వెన్నునూతల గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 2014 డిసెంబరు 8 హైదరాబాదు |
మరణ కారణం | అనారోగ్యం |
వృత్తి | పత్రికా సంపాదకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | సూర్యకుమారి |
పిల్లలు | కృష్ణకిశోర్ |
కృష్ణా పత్రిక ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఇతడు చేసిన కృషి చెప్పుకో దగింది. చైతన్య వంతమైన సంపాదకీయాలతో ఈ పత్రిక ఇతని ఆధ్వర్యంలో నిర్మొహమాటమైన నిష్పాక్షికమైన పంథాను అవలంబించింది. ఇతని సారథ్యంలో కృష్ణాపత్రిక కార్యాలయం సాహితీవేత్తలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఎన్నో చారిత్రక, రాజకీయ, సాహిత్య చర్చలు ఆరోగ్యవంతమైన రీతిలో జరిగేవి. పత్రికా దర్బార్, కాకతీయ విజయం, భువనవిజయం, గోల్కొండ విజయం మొదలైన సాహిత్య రూపకాలు పత్రికా కార్యాలయ ప్రాంగణంలో జరిగేవి.ప్రసాదరాయకులపతి, ఓగేటి అచ్యుతరామశాస్త్రి, రాళ్ళబండి కవితాప్రసాద్, జి.ఎం.రామశర్మ, కసిరెడ్డి వెంకటరెడ్డి, మరుమాముల దత్తాత్రేయ శర్మ, అనంతలక్ష్మి, సాధన నరసింహాచార్య వంటి సాహిత్యవేత్తలతో ఇతని ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్యకార్యక్రమాలు జరిగేవి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.