పిన‌ర‌యి విజ‌య‌న్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విజ‌య‌న్ సీపీఎం నాయకుడు. ఆయన రెండొవసారి కేరళ ముఖ్యమంత్రిగా 20 మే 2021న భాద్యతలు స్వీకరించాడు. [3][4]

త్వరిత వాస్తవాలు 12వ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరు ...
పిన‌ర‌యి విజ‌య‌న్
Thumb


12వ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 మే 2016
గవర్నరు పి.సతశివం
ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
ముందు ఊమెన్‌ చాందీ

హోం మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 మే 2016
ముందు రమేష్ చెన్నితాల

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 జూన్ 2016
ముందు కేకే. నారాయణన్
నియోజకవర్గం ధర్మదోమ్ నియోజకవర్గం

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 మార్చి 2002

సీపీఎం కేరళ రాష్ట్ర కార్య‌ద‌ర్శి
పదవీ కాలం
25 సెప్టెంబర్ 1998  23 ఫిబ్రవరి 2015
ముందు చదయాన్ గోవిందన్
తరువాత కొడియేరి బాలకృష్ణన్

విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
20 మే 1996  19 అక్టోబర్ 1998
ముందు జి. కార్తికేయన్
తరువాత ఎస్.శర్మ

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
20 మే 1996  19 అక్టోబర్ 1998
ముందు ఎంవీ.రాఘవన్
తరువాత ఎస్.శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం (1945-05-24) 1945 మే 24 (వయసు 79)
పిన‌ర‌యి , మలబార్ జిల్లా, కేరళ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం)
జీవిత భాగస్వామి టి. కమలమూస:పెళ్లి[1]
సంతానం 2
నివాసం క్లిఫ్ హౌస్, తిరువనంతపురం, కేరళ
పూర్వ విద్యార్థి గవర్నమెంట్ బ్రేన్నెన్ కాలేజీ, తలాసేరి[2]
మూసివేయి

జననం & విద్యాభాస్యం

పిన‌ర‌యి విజ‌య‌న్ 1945, మే 24న కేరళ రాష్ట్రం, మలబార్ జిల్లా (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ), పినరాయి గ్రామంలో జన్మించాడు. విజ‌య‌న్ తండ్రి మరోలి కోరన్, క‌ల్లుగీత కార్మికుడు, తల్లి కళ్యాణి, గృహిణి. వారికి 14వ సంతానంగా ఆయన జ‌న్మించాడు. ఆయన పెర్లాసరీ హైస్కూల్లో ప్రాథమిక విద్య, బ్రెన్నాన్ కాలేజీలో బీఏ పూర్తి చేశాడు.

వివాహం

పిన‌ర‌యి విజ‌య‌న్ 1979లో కమల విజయన్ ను వివాహమాడాడు. కమల విజయన్ రిటైర్డ్ టీచర్. విజయన్ దంపతులకు ఇద్దరు సంతానం వీణ, వివేక్ కిరణ్, పి.ఎ.మొహమ్మద్‌ రియాస్‌ (అల్లుడు) ఉన్నారు.[5]

రాజకీయ జీవితం

విజ‌య‌న్ పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన బ్రెన్నెన్ గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీలో చదువుతున్నప్పుడే క‌న్నూరు జిల్లాలో విద్యార్థి నాయ‌కుడిగా పనిచేశాడు. ఆయన 1964లో కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ క‌న్నూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. 1964లో విజ‌య‌న్ సీపీఎంలో స‌భ్య‌త్వం తీసుకున్నాడు. ఆయన జిల్లా కమిటీ, జిల్లా సెక్రటేరియట్‌లలో సభ్యునిగా బాధ్యతలతో పాటు పార్టీలో పలు పదవులు చేపట్టాడు. 1986లో కన్నూర్ జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఎమెర్జెన్సీ సమయంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపాడు. విజ‌య‌న్ 25 ఏళ్ల వ‌య‌సులో 1970లో కూతుపరంబ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 1998లో కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై ఈ పదవిలో 2015 వరకు కొనసాగాడు.

విజయన్ 2016 మే 25న కేరళ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదోమ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.రఘునాధన్ (కాంగ్రెస్) పై 50,123 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు

మరింత సమాచారం సంవత్సరం, నియోజకవర్గం ...
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరంనియోజకవర్గంప్రత్యర్థిమెజారిటీ (ఓట్లు)
1970కుతుపరంబతయత్ రాఘవన్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)743
1977కుతుపరంబఅబ్దుల్ ఖాదర్ ( రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా)4,401
1991కుతుపరంబపి.రామకృష్ణన్ (కాంగ్రెస్)12,960
1996పయ్యనూర్కేఎన్ కన్నోత్‌ (కాంగ్రెస్)28,078
2016ధర్మదంమంబరం దివాకరన్ (కాంగ్రెస్)36,905
2021ధర్మదంసి.రఘునాధన్ (కాంగ్రెస్)50,123 [6][7]
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.