తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
పినపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
పినపాక | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, పినపాక స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.034566°N 80.688°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | పినపాక |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 237 km² (91.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,376 |
- పురుషులు | 23,708 |
- స్త్రీలు | 24,668 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.68% |
- పురుషులు | 62.44% |
- స్త్రీలు | 38.57% |
పిన్కోడ్ | 507117 |
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం పినపాక.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,376 - పురుషులు 23,708 - స్త్రీలు 24,668
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 33,155. జనాభాలో పురుషులు 15,933 కాగా, స్త్రీల సంఖ్య 17,222. మండలంలో 8,757 గృహాలున్నాయి.[3]
లోగడ పినపాక మండలం,ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పినపాక మండలాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.