శ్రీ వెంకటేశ్వర దేవస్థానం (పిట్స్‌బర్గ్)

అమెరికా, పెన్సిల్వేనియాలోని పెన్ హిల్స్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. From Wikipedia, the free encyclopedia

శ్రీ వెంకటేశ్వర దేవస్థానం (పిట్స్‌బర్గ్)map

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలిన ఆలయం ఒకటి అమెరికా దేశంలోని పెన్సిల్ వేనియా రాష్ట్రంలో ఉన్న పిట్స్ బర్గ్ నగరంలో ఉంది. అమెరికాలోని తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానానికి 1976 నవంబరు 17 న ప్రతిష్ఠాపన జరిపారు.[1] పిట్స్‌బర్గ్ మెట్రోపాలిటన్ ఏరియాలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల నమూనాగా ఈ దేవాలయం రూపొందించబడింది. 2014 నాటికి ఈ ప్రాంతంలో దాదాపు 10,000 మంది హిందువులకు సేవలందించింది.[2] ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది సభ్యులు ఉన్నారు.

త్వరిత వాస్తవాలు పిట్స్‌బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, భౌగోళికం ...
పిట్స్‌బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం
Thumb
భౌగోళికం
భౌగోళికాంశాలు40.441039°N 79.805083°W / 40.441039; -79.805083
దేశంఅమెరికా
రాష్ట్రంపెన్సిల్వేనియా
స్థలంపిట్స్‌బర్గ్
సంస్కృతి
ముఖ్యమైన పర్వాలువివిధ సేవలు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుఆగమ శాస్త్ర శైలి
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
స్థాపితం1976 నవంబరు 17
వెబ్‌సైట్https://www.svtemple.org
మూసివేయి

నిర్మాణం

1973లో పిట్స్‌బర్గ్‌లోని హిందూ టెంపుల్ సొసైటీ స్థాపించబడింది. 1974లో న్యూయార్క్‌లోని నేషనల్ హిందూ టెంపుల్ సొసైటీ నుండి 400,000 డాలర్ల నిధులను పొందింది. 1976, జూన్ 30న గ్రౌండ్‌బ్రేకింగ్ వేడుక జరిగింది. మరుసటి రోజు ప్రారంభించబడింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర దేవాలయాన్ని తలపించేలా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.[3] 2011లో, ఈ దేవాలయం 15,000 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్‌లు, ఆభరణాలను దొంగిలించబడ్డాయి.[4]

ఈ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ శాఖ సహకారంతో రూపకల్పన చేయించారు. ఆలయ గోపురానికి ఇరువైపులా రెండు చేతుల వంటి నిర్మాణాలతో దీన్ని నిర్మించారు.[5]

దేవాలయం కింది అంతస్తులో ఫలహారశాల ఉంది.[6]

పిట్స్ బర్గ్

250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరం ఒకప్పుడు ఒక చిన్న రేవు పట్టణం. అప్పట్లో పోర్ట్ బిట్ అని పిలవబడిన ఆ రేవుపై ఆధారపడి జీవించే వారి జనాభా భారీగా పెరిగిపోయి క్రమంగా పెద్ద జనావాసంగా మారింది. తరువాతి కాలంలో అక్కడే పిట్స్ బర్గ్ గా రూపాంతరం చెందింది. బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విలియం పిట్ పేరు మీద పిట్స్బర్గ్ కి నామకరణం చేశారు. ఉక్కు పరిశ్రమకి ప్రధాన కేంద్రంగా ఉంటూ సిటీ ఆఫ్ బ్రిడ్జ్స్ అని, సిటీ ఆఫ్ స్టీల్ అని పేరు గాంచింది.

మూలాలు

బయటి లింకులు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.